Veera Simha Reddy Twitter Review: వీరసింహారెడ్డి సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’ . శృతి హాసన్, హనీ రోజ్ లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ లు కలిసి బాలయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ లు కూడా అదిరిపోయాయి. దీంతో సంక్రాంతి కానుకగా జనవరి 13 న విడుదల కాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆల్రెడీ ఓవర్సీస్ లో ఈ చిత్రం ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. వీరసింహారెడ్డి ఫస్ట్ హాఫ్ బాగుందట..! సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ ఉన్నా క్లైమాక్స్ ను దర్శకుడు గోపీచంద్ డిజైన్ చేసిన తీరు బాగుందని తెలుస్తుంది.

ఇంటర్వల్ సీక్వెన్స్, మ్యారేజ్ ఫైట్, క్లైమాక్స్, సుగుణ సుందరి సాంగ్, బాలయ్య డాన్స్ మూమెంట్స్ .. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి అని తెలుస్తుంది. ఓవరాల్ గా వీరసింహారెడ్డి కి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి మార్నింగ్ షోలు తర్వాత ఇక్కడి టాక్ ఎలా ఉంటుందో చూడాలి..

Click Here For The REVIEW

 

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus