మూడో మల్టీస్టారర్ సినిమాకి ఓకే చెప్పిన వెంకటేష్

గురు సినిమా తర్వాత వెంకటేష్ కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ.. గ్యాప్ లేకుండా సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. F2 అనే టైటిల్, ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే ట్యాగ్ లైన్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ తో కలిసి వరుణ్ తేజ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత బాబీ దర్శకత్వంలో మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకీ ఓ చిత్రం చేయబోతున్నారు. ఇందుకు వెంకీ మామ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇది కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

తాజాగా మూడో మల్టీస్టారర్ సినిమాకి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. తమిళ హీరో సూర్య తో కలిసి నటించడానికి ఓకే చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఇందులో ఇద్దరూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మితం కానున్న ఈ మూవీకి డైరక్టర్ ఎవరనేది త్వరలోనే తెలియనుంది. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషలో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇలా వరుసగా మల్టీస్టారర్ సినిమాలకు ఓకే చెప్పి వెంకీ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. అలాగే ఇక నుంచి తాను మల్టీస్టారర్ కథలనే చేయనున్నట్లు ఫిలిం మేకర్స్ కి చెప్పకనే చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus