Venkatesh: కొడుకు ఎంట్రీ పై వెంకీ ఫన్నీ కామెంట్స్?

  • January 4, 2024 / 01:59 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు వెంకటేష్ ఒకరు. వెంకటేష్ తాజాగా తన 75వ చిత్రం సైందవ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ మీడియా సమావేశంలో భాగంగా హీరో (Venkatesh) వెంకటేష్ కు తన కొడుకు సినిమా ఎంట్రీ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా వెంకటేష్ తన కుమారుడు అర్జున్ సినిమా ఎంట్రీ గురించి మాట్లాడుతూ వాడు ఎక్కడో చదువుకుంటున్నాడు అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. అయితే అందరికీ నేను ముందుగా చెప్పేది ఒకే విషయం ముందు చదువు పూర్తి చేయండి తర్వాత ఇతర విషయాల గురించి ఆలోచించండి అంటూ ఈయన కామెంట్ చేశారు.

ఈ విధంగా కొడుకు సినిమా ఎంట్రీ గురించి మొదటిసారి రియాక్ట్ అవుతూ వెంకటేష్ ఇలాంటి కామెంట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. అయితే ముందు చదువులు అన్ని పూర్తి చేసిన తర్వాత తన కొడుకుకు ఇష్టమైన రంగం వైపే వెంకటేష్ ప్రోత్సహించబోతున్నారని తెలుస్తోంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus