ఎంటర్‌టైన్‌మెంట్ కేరాఫ్ విక్టరీ వెంకటేష్. వినోదానికి అతడు చిరునామా అంటే అతిశయోక్తి కాదు. అందుకే మూడు దశాబ్ధాల కెరీర్‌ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు మన అభిమాన హీరో వెంకీ. హీరోగా ప్రయాణం మొదలై 30 ఏళ్లయింది. తొలి చిత్రం కలియుగ పాండవులు 1986 ఆగస్టు 14న విడుదలైంది. నాటి నుంచి టాలీవుడ్‌లో తిరుగులేని హీరోగా ఎదిగారు వెంకటేష్. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియెన్ అందరికీ ఇష్టుడైన హీరోగా తనని తాను ఆవిష్కరించుకున్నారు.
ఈ పనయంలో 70 పైగా చిత్రాల్లో నటించారు. ఇలాంటి సందర్భంలో అతడు నటించిన `బాబు బంగారం` ఆడియో రిలీజవుతోంది. ఈ వేదిక ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈరోజు సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగే ఈ ఆడియో వేడుకలో ప్రముఖ దర్శకులందరినీ సన్మానించనున్నారు వెంకీ.
కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, వి.వి.వినాయక్ , విజయ్ భాస్కర్, గౌతమ్ మీనన్ సహా పలువురు దర్శకులతో పనిచేశారు వెంకీ. వీళ్లందరికీ ఈ వేదికపై సన్మానం చేయనున్నారు. ఆగస్టు 12న `బాబు బంగారం` రిలీజవుతున్న సంగతి తెలిసిందే.