ఆ యువ హీరో ఆనందానికి కారణం వెంకటేష్ అట..!

ఈ ఏడాది ఆరంభంలోనే ‘ఎఫ్2’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఇప్పుడు నాగ చైతన్యతో కలసి ‘వెంకీ మామ’ చిత్రంతో చాలా బిజీగా గడుపుతున్నాడు. ఇక కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు మన వెంకీ మామ. ఈ విషయాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. ఈరోజు ఉదయం ఆయన ఓ యంగ్ హీరోకి ఫోన్ చేసి సర్ ప్రైజ్ చేసాడు. ఆ హీరోనే సోషల్ మీడియాలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆ యంగ్ హీరో మరెవరో కాదు శ్రీవిష్ణు.

ఆయన హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘బ్రోచేవారెవరురా’. తాజాగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. క్రైం కామెడీ నేపథ్యంలో సాగె కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం చూసినవారంతా బాగా ఎంజాయ్ చేశామని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని చూసిన విక్టరీ వెంకటేష్ శ్రీవిష్ణుకి ఈ ఉదయం ఫోన్ చేసి మరీ అభినందించారట. ‘ఈ ఉదయం వెంకటేష్ గారు నాకు ఫోన్ చేసి అభినందించారు. దీనితో నా సంతోషానికి అవధులు లేవు.” అంటూ పేర్కొన్నాడు. ‘బ్రోచేవారెవరురా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా తన అభిమాన నటుడు వెంకటేష్ అని శ్రీ విష్ణు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్లో ‘మెంటల్ మదిలో’ అనే సినిమాలో కూడా హీరోగా నటించాడు శ్రీవిష్ణు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus