Venkatesh: రూ.200 కోట్లు దాటేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఈ వీకెండ్‌కి ఆ రికార్డు ఢమాల్‌!

కొన్ని సినిమాలను అంచనాలు ఇబ్బంది పెడితే.. ఇంకొన్ని సినిమాలకు బూస్ట్‌లాగా పనికొస్తాయి. రెండో రకం కాన్సెప్ట్‌లో ఈ సంక్రాంతికి విడుదలైన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’  (Sankranthiki Vasthunam). వెంకటేశ్‌ (Venkatesh Daggubati)  – ఐశ్వర్య రాజేశ్‌ (Aishwarya Rajesh) – మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) – అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ఇది. ఇప్పటికే రెండేళ్ల క్రితం నాటి వసూళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఈ సినిమా ఐదేళ్ల క్రితం నాటి రికార్డు మీద కన్నేసింది. ఈ జోరు ఇలానే కొనసాగితే ఈ వీకెండ్‌లోనే ఆ రికార్డులు బద్ధలవుతుంది.

Venkatesh

టాలీవుడ్‌లో సీనియర్‌ స్టార్‌ హీరోల్లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్ల రికార్డు చిరంజీవి (Chiranjeevi) పేరు మీదనే ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాతో రెండేళ్ల క్రితం వచ్చి రూ.236 కోట్ల వసూల్లు అందుకున్నాడు చిరు. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా 8 రోజుల్లో రూ. 218 కోట్ల వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిరు రికార్డు నిలవడం పెద్ద విషయం కాదు. దీంతో నెక్స్ట్‌ టార్గెట్‌ ఎవరు అని చూస్తే అల్లు అర్జున్‌  (Allu Arjun)  సినిమా ‘అల వైకుంఠపురమలో..’ (Ala Vaikunthapurramuloo) కనిపిస్తోంది.

‘అల వైకుంఠపురములో’ సినిమా 2020లో ఫుల్ రన్‌లో రూ.250 కోట్ల గ్రాస్‌ వసూళ్లు అందుకుంది. పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ కాని సినిమాల్లో దీనిదే రికార్డు. ఐదేళ్లుగా ఈ రికార్డు అలానే ఉంది. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఆ రికార్డును దాటే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే ఫిబ్రవరి 7 వరకు సరైన సినిమాలు లేవు. అంటే అప్పటివరకు వెంకటేశ్‌ – అనిల్‌ రావిపూడిదే హవా.

ఒకవేళ ఇదే జరిగితే చాలా ఏళ్ల తర్వాత వెంకటేశ్‌ సినిమా ఇతర హీరోలకు టార్గెట్‌గా మారుతుంది. ఇన్నాళ్లూ తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్లడం వెంకటేశ్‌ నుండి చూస్తున్నాం. ఇప్పుడు ఆయన మిగిలిన హీరోలకు టార్గెట్‌ సెట్‌ చేయడం అనేది అరుదైన విషయం. ఈ అవకాశం ఇచ్చింది మాత్రం కచ్చితంగా ఈ సంక్రాంతికి వచ్చిన మిగిలిన సినిమాల ఫలితాలే అని చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus