Venkatesh: ఎన్నడూ లేని విధంగా వెంకీ ప్రమోషన్స్..?

  • December 12, 2023 / 12:48 PM IST

విక్టరీ వెంకటేష్ ఓ సినిమాని ఫైనలైజ్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు. మధ్యలో సురేష్ బాబు జోక్యం కూడా ఉంటుంది. పారితోషికం లెక్కలు వంటివి పర్ఫెక్ట్ గా కుదిరిన తర్వాతే వెంకీతో సినిమా ఫైనల్ అవుతుంది. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ కి.. అయినా ఇదే టెంప్లేట్..! అయితే యంగ్ డైరెక్టర్ కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉన్న శైలేష్ కొలను.. అతి తక్కువ సమయంలోనే ‘సైందవ్’ ప్రాజెక్టుని ఓకే చేయించుకున్నాడు.

దీనికి ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయింది. ఇక టీజర్ చూశాక.. శైలేష్ కొలనుని ప్రశంసలతో ముంచెత్తారు వెంకీ అభిమానులు. సరే అదంతా పక్కన పెట్టేస్తే.. సీనియర్ హీరోలు సినిమా ప్రమోషన్స్ కి రావడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు అనే అభిప్రాయాలు కూడా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తాయి. కానీ వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ హీరో.. ‘సైందవ్’ వంటి సినిమాని తెగ ప్రమోట్ చేస్తూ ఉండటం అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది అని చెప్పాలి.

ఈ సినిమాని తన భుజాలపై వేసుకుని మరీ ప్రమోట్ చేస్తున్నాడు వెంకీ. 2024 జనవరి 13న సంక్రాంతి కానుకగా ‘సైందవ్’ రిలీజ్ కానుంది. పోటీగా కొన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందుకే అనుకుంట ఈ సినిమాని తెగ ప్రమోట్ చేస్తున్నారు వెంకీ. ఎన్నడూ లేని విధంగా కాలేజీలకి వెళ్లి ‘రాంగ్ యూసేజ్’ పాటను విడుదల చేశారు.

దానికి ముందు అభిమానుల సమక్షంలో టీజర్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడైతే ఏకంగా విజయవాడకి వెళ్లి అక్కడ రెండో పాటను విడుదల చేస్తున్నారు. పనిలో పనిగా అక్కడ బాబాయ్ హోటల్ కి వెళ్లి భోజనం కూడా చేశారు (Venkatesh) వెంకీ. ఈ రకంగా సీనియర్ హీరోలందరికీ ఇన్స్పిరేషన్ గా కూడా నిలిచారు అని చెప్పొచ్చు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus