మరో మల్టీస్టారర్ కు రెడీ అయిన వెంకీ మామ?

టాలీవుడ్లో మల్టీ స్టారర్ అనే కొత్త ట్రెండ్ ను స్టార్ట్ చేసింది కచ్చితంగా విక్టరీ వెంకటేష్ అనే చెప్పాలి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం కోసం ఏకంగా మూడేళ్ళు వెయిట్ చేసి మరీ సెట్స్ కు తీసుకెళ్ళాడు. అంతేనా ఆ చిత్రం సూపర్ హిట్టవ్వడం తో టాలీవుడ్లో మరిన్ని మల్టీ స్టారర్ చిత్రాలొచ్చాయి. ‘మసాలా’ ‘గోపాల గోపాల’ ఈ సంవత్సరం వచ్చిన ‘ఎఫ్2’ చిత్రాలతో వరుసగా మల్టీ స్టారర్ చిత్రాల్ని ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్యతో ‘వెంకీమామ’ చిత్రం చేస్తున్న వెంకటేష్ త్వరలోనే మరో మల్టీ స్టారర్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడట.

వివరాల్లోకి వెళితే… విజయ్ సేతుపతి, మాధవన్ హీరోలుగా వచ్చిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘విక్రమ్ వేద’ ను తెలుగులోకి రీమేక్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ రీమేక్ లో మరో హీరోగా నారా రోహిత్ నటించబోతున్నట్టు సమాచారం. మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ రీమేక్ ను డైరెక్ట్ చేయబోతుండగా వెంకటేష్ అన్నయ్య డి.సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరించనున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ పైనే వినాయక్ బిజీగా ఉన్నాడట. మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయబోతున్నాడట వినాయక్. ఈ మధ్య వినాయక్ ఫామ్లో లేడు కాబట్టి ఆఫర్లు రావట్లేదు.. ఇక నారా రోహిత్ సిట్యుయేషన్ కూడా అదే..! మరి వీరిద్దరికీ ‘వెంకీమామ’ హిట్టిస్తాడేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus