‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విక్టరీ వెంకటేష్..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది ఈ సినిమా. వాస్తవానికి 2018 లోనే ఈ కాంబోలో ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు. కానీ ఆ టైంలో ఎందుకో సెట్ అవ్వలేదు. 7 ఏళ్ళ తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్టు సెట్ అయ్యింది. త్రివిక్రమ్ రైటింగ్లో వెంకటేష్ ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘వాసు’ ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలు చేశారు.
ఇందులో ‘వాసు’ తప్ప మిగిలిన 2 సూపర్ హిట్ అయ్యాయి. ఈసారి వెంకీ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతుండటంతో కచ్చితంగా ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంతా భావిస్తున్నారు. నిజానికి ఈ నవంబర్ నుండే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ళాలి. కానీ లేట్ అవుతుంది. అందుకు కారణం చిరంజీవి ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ సినిమా.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పైగా దీనికి వెంకీ వీరాభిమాని అయిన అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ మధ్యనే సెట్స్ లోకి అడుగుపెట్టారు వెంకీ. ఓ వీడియోతో చిత్ర బృందం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్, శంషాబాద్ లో చిరంజీవి – వెంకీలపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.
25 రోజుల పాటు వెంకటేష్ ‘మనశంకర్ వరప్రసాద్ గారు’ సెట్స్ లోనే గడుపుతారు. చిరుతో వెంకీకి కొన్ని కాంబినేషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. సీనియర్ స్టార్ హీరోల్లో తొలిసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న స్టార్ హీరోలు చిరు, వెంకీ..నే అని చెప్పాలి. కచ్చితంగా 2026 సంక్రాంతికి వీరి కాంబినేషన్ స్పెషల్ గా ఉంటుందని అంతా నమ్ముతున్నారు.