వెంకటేష్ కొడుకు రానాను మించిపోయేలా ఉన్నాడుగా..!

టాలీవుడ్ హీరోలలో అప్పట్లో ప్రభాస్ హైట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేవారు. ఆరడగులకు మించిన హైట్, వెడల్పాటి శరీరం కలిగిన ప్రభాస్ యాక్షన్ సీక్వె న్స్ చూస్తుంటే ఫ్యాన్స్ కి పూనకం వచ్చేది. ఆ తరువాత ఆయన్ని మించిన హైట్ కలిగిన హీరోగా రానా, వరుణ్ తేజ్ లాంటి వారు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. ముఖ్యంగా రానా హైట్ పై కూడా పెద్ద చర్చ నడిచింది. వెడల్పాటి చేతితో ఆజాను బాహుడైన రానా ఫిజిక్ యాక్షన్ హీరోలకు పర్ఫెక్ట్ మ్యాచ్.

ఆయన హైట్ మరియు ఫిజిక్ కారణంగానే బాహుబలి సినిమాలో ప్రభాస్ ని ఎదుర్కొనే భల్లాల దేవ పాత్రకు రాజమౌళి ఎంపిక చేయడం జరిగింది. కాగా టాలీవుడ్ లో త్వరలో మరో జైన్ట్ హీరో రానున్నాడని అర్థం అవుతుంది. అతనెవరో కాదు విక్టరీ వెంకటేష్ కుమారుడు అర్జున్ దగ్గుబాటి. మొన్న జరిగిన రానా మిహికాల ప్రీ వెడ్డింగ్ వేడుకలో చాలా కాలం తరువాత దర్శనమిచ్చాడు అర్జున్. టీనేజ్ కూడా నిండని అర్జున్ అప్పుడే ఆరడుగుల హైట్ చేరుకున్నాడని తెలుస్తుంది.

గ్రూప్ ఫొటోలో అర్జున్ ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. టీనేజ్ లోనే ఇంత హైట్ ఉన్న అర్జున్ తన అన్నయ్య రానా హైట్ కూడా అధిగమించి వేస్తాడు అనిపిస్తుంది. అప్పట్లో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ ఆడియో విడుదల వేడుకలో అర్జున్, మహేష్ కుమారుడు గౌతమ్ తో కలిసి సందడి చేశాడు. ఇక అర్జున్ తాజా లుక్ చూస్తే దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో టాల్ హీరో వస్తున్నాడు అనిపిస్తుంది. ఐతే ఈ విషయంలో పవన్ కుమారుడు అకీరా అందరికంటే ముందున్నాడు. 16ఏళ్ల వయసులో ఉన్న అకీరా ప్రస్తుత హైట్ 6.4 అంగుళాలు కావడం విశేషం.

1

2

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus