Venky Kudumula: ‘విక్రమ్’ ప్రమోషన్లో భాగంగా ఆ వార్త పై క్లారిటీ ఇచ్చేసిన వెంకీ..!

మెగాస్టార్ చిరంజీవి… ‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మాత అయిన డీవీవీ దానయ్యకి ఓ సినిమా చేసి పెట్టాలి. ఈ విషయాన్ని చిరంజీవి.. ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టుకి త్రివిక్రమ్ దర్శకుడు అని కూడా అనౌన్స్ చేసేశారు చిరు. త్రివిక్రమ్ మొహమాటంగానే ఆ టైంలో ఓకె చెప్పినట్టు అందరికీ అనిపించింది. అనుకున్నట్టు గానే ఆ ప్రాజెక్టు నుండీ త్రివిక్రమ్ తప్పుకోవడం.. అతని ప్లేస్ లో త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుముల వచ్చి చేరడం జరిగింది.

వెంకీ కుడుముల చేసింది రెండే రెండు సినిమాలు. ఒకటి ‘ఛలో’ ఇంకోటి ‘భీష్మ’. ఈ రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి. చిరు ఓకే చెప్పడానికి కూడా ఇదే రీజన్ అయ్యుండొచ్చు. కాకపోతే వెంకీ స్క్రిప్ట్ ను చిరు ఇంకా ఓకే చేయలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఓకే కాలేదు అనే కామెంట్స్ వినిపించాయి. ‘ఆచార్య’ ప్లాప్ అవ్వడంతో వెంకీ సినిమాని చిరు పక్కన పెట్టినట్టు కూడా కామెంట్స్ వినిపించాయి.

కానీ వెంకీ కుడుముల టీం మాత్రం ఆ వార్తల్ని ఖండించింది. అదే సమయంలో ఒక హింట్ కూడా ఇచ్చింది. స్క్రిప్ట్ ఇంకా చిరుకి వినిపించలేదు. ఒకవేళ చిరు విని ఓకె చేయకపోతే.. తర్వాతి ప్రణాళికలు వేరే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. దాంతో మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి. స్క్రిప్ట్ చిరుకి నచ్చకపోతే ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయని వారు ఒప్పుకున్నట్టే.! అందుకే మళ్ళీ ఈ ప్రాజెక్టు డౌట్ అనే కామెంట్స్ వినిపించాయి.

అయితే వెంకీ కుడుముల మాత్రం ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేసాడని చెప్పొచ్చు. తాజాగా ‘విక్రమ్’ మూవీ ప్రమోషన్లలో భాగంగా అతను కమల్ హాసన్ ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ నేపథ్యంలో వెంకీ ఇప్పటికే రెండు సినిమాలు చేశానని నెక్స్ట్ సినిమా చిరంజీవి గారితో ఓ చేస్తున్నాను అంటూ కమల్ కు తనను తాను పరిచయం చేసుకున్నాడు. కాబట్టి చిరుతో తన నెక్స్ట్ సినిమా ఫిక్స్ అని వెంకీ పరోక్షంగా కాన్ఫిడెంట్ గా చెప్పినట్టే..!

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus