‘వెంకీమామ’ ఓవర్సీస్ బిజినెస్ డీటెయిల్స్..!

  • December 5, 2019 / 02:57 PM IST

విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీమామ’. డిసెంబర్ 13న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఆ రోజు వెంకటేష్ పుట్టినరోజు కూడా కావడంతో అభిమానులకి మరింత పండగనే చెప్పాలి. కె.ఎస్.రవీంద్ర(బాబీ) డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘కోన ఫిలిం కార్పొరేషన్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలకి అద్భుతమైన స్పందన లభిస్తుంది. ఇక ఈ ఏడాది ‘ఎఫ్2’ తో వెంకటేష్, ‘మజిలీ’ తో నాగచైతన్య బ్లాక్ బస్టర్లు కొట్టి మంచి ఫామ్లో ఉండడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్టే బిజినెస్ కూడా జరుగుతుందని తెలుస్తుంది.

ఇక తాజాగా ఈ చిత్రం ఓవర్సీస్ బిజినెస్ కూడా పూర్తయినట్టు సమాచారం. ‘యూ.ఎస్.ఏ’ లో ఈ చిత్రాన్ని 2.4 కోట్లకు అమ్మినట్టు తెలుస్తుంది. ఇక ‘రెస్ట్ ఆఫ్ వరల్డ్’ కి 0.40 కోట్ల కు అమ్మకాలు జరిగినట్టు తెలుస్తుంది. టోటల్ గా ఓవర్సీస్ మొత్తం 2.8 కోట్లకు అమ్మారన్న మాట. సో అక్కడ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 0.7 మిలియన్ నుండీ 0.8 మిలియన్ డాలర్ల వరకూ రాబట్టాల్సి ఉంది. వెంకీ ‘ఎఫ్2’ 2 మిలియన్ డాలర్ల పైనే వసూల్ చేయగా.. చైతన్య ‘మజిలీ’ చిత్రం 0.9 మిలియన్ డాలర్ల పైనే వసూల్ చేసింది. కాబట్టి ‘వెంకీమామ’ చిత్రం 0.8 మిలియన్ డాలర్లను రాబట్టడం కేక్-వాక్ అనే చెప్పొచ్చు.


అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus