ఆర్ఆర్ఆర్ టీమ్ కి వీణతో స్పెషల్ విషెస్ చెప్పిన వీణ శ్రీవాణి.. వీడియో వైరల్!

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచు వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా అందరి జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తున్నటువంటి వేణు స్వామి ప్రముఖ వీణ వాయిద్యకారిని శ్రీ వాణినీ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తాజాగా బయటపడింది. ఇలా శ్రీవాణి వేణు స్వామి భార్య అని తెలియగానే ఎంతోమంది ఆశ్చర్యపోయారు.

వీణ వాయించడంలో ఎంతో నైపుణ్యం కలిగినటువంటి శ్రీవాణి తన పేరు పక్కన ఏకంగా వీణ అని కూడా చేర్చుకొని వీణ శ్రీవాణిగా మారిపోయారు.ఈమె వేణు స్వామికి భార్య అవుతారని తెలియగానే వేణు స్వామికి ఇంత అందమైన భార్య ఉందా అని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. అయితే తాజాగా సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకోవడంతో ప్రతి ఒక్కరు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే శ్రీ వాణి సైతం వీణ వాయిస్తూ నాటునాటు సాంగ్ ఆస్కార్ గెలుచుకున్నందుకు ఈమె స్పెషల్ విషెస్ తెలియజేశారు. నాటు నాటు పాటకి తన వీణతో ట్రిబ్యూట్ అందించారు. నాటు నాటు సాంగ్ బీట్ ని తన వీణతో అద్భుతంగా వాయిస్తూ అందరి హృదయాలు దోచుకుంటున్నారు. ఎంతో ఆహ్లాదంగా, వినసొంపుగా నాటు నాటు సాంగ్ ని ఆమె తన వీణలో ప్రదర్శించారు. ఇలా ఈమె టాలెంట్ చూసి ప్రతి ఒక్కరూ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీవాణి ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఆర్ఆర్ఆర్ టీంకి కంగ్రాట్స్ చెబుదాం. నాటు నాటు ఆస్కార్ సాధించిన తొలి ఇండియన్ సాంగ్ గా చరిత్ర సృష్టించింది. ఇది గొప్ప గౌరవం అంటూ ఈమె ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో ఈ వీడియో వైరల్ గా మారి సోషల్ మీడియాని షేర్ చేస్తోంది.ఇది చూసినటువంటి నెటిజన్స్ ఇదేం టాలెంట్ రా బాబు అంటూ పెద్ద ఎత్తున ఈ వీడియో పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus