NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘దేవర’ తర్వాత తారక్ చేస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియా వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇన్నాళ్లు కేవలం అనౌన్స్ మెంట్లు, పోస్టర్లకే పరిమితమైన ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఒక సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. సైలెంట్ గానే ఒక భారీ షెడ్యూల్ ను పూర్తి చేశారట. ఈ వార్త వినగానే నందమూరి అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.

NTR

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా కోసం ఒక భారీ ఫారెస్ట్ సెట్ వేశారట. అందులో ఎన్టీఆర్ పై ఒక ఎపిక్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు. దాదాపు 100 మంది ఫైటర్లు, క్రూతో జరిగిన ఈ షూటింగ్ ఇప్పుడు విజయవంతంగా పూర్తయ్యింది. నీల్ మార్క్ ఎలివేషన్స్ తో, రగ్గడ్ లుక్ లో ఈ ఫైట్ సీన్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. ‘రియల్ మాన్స్టర్’ అంటూ ప్రచారంలో ఉన్న ట్యాగ్ కు న్యాయం చేసేలా ఈ ఎపిసోడ్ ను డిజైన్ చేశారట.

అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రియాక్షన్స్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కొందరేమో “ఏంటో షూటింగ్ ల కన్నా బ్రేకులే ఎక్కువ ఉంటున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేస్తుంటే, మరికొందరు మాత్రం “అప్డేట్స్ లేకపోయినా పర్లేదు, కనీసం షూటింగ్ జరుగుతోంది కదా అదే సంతోషం” అని కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫీలో కేవలం షూటింగ్ స్టార్ట్ అయ్యిందనే వార్తకే ఫ్యాన్స్ ఇంతలా రిలాక్స్ అవ్వడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.

ప్రస్తుతం ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ ముగియడంతో యూనిట్ చిన్న బ్రేక్ తీసుకుంది. పండగ తర్వాతే మళ్ళీ కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. సంక్రాంతి సందడి ముగిశాక, ఎన్టీఆర్ మళ్ళీ నీల్ ప్రపంచంలోకి అడుగుపెడతారు. ఈ గ్యాప్ లో దర్శకుడు రషెస్ చూసుకుని, తదుపరి షెడ్యూల్ కు పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు. బ్రేకులు ఉన్నా సరే, అవుట్ పుట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ బలంగా వినిపిస్తోంది. కేజీఎఫ్, సలార్ లాంటి హిట్ల తర్వాత నీల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఇందులో ఎన్టీఆర్ ను ఎంత వైల్డ్ గా చూపిస్తారో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags