పవన్ కళ్యాణ్ నటించిన మొదటి 3 సినిమాలు అన్న చాటు తమ్ముడిగానే చేశాడు.కానీ తనని తాను సొంతంగా ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ‘తొలిప్రేమ’ చేశాడు. అది పవన్ కళ్యాణ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ని తెచ్చిపెట్టింది. అలాగే కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దానికి దర్శకుడు కరుణాకరన్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు కరుణాకరన్. 6 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్- కరుణాకరన్ దర్శకత్వంలో ‘బాలు'(Balu) అనే సినిమా వచ్చింది.
‘వైజయంతి మూవీస్’ సంస్థ పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2004 జనవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘బాలు’ చిత్రం. మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలన్నీ విడుదలకి ముందే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఆడియో క్యాసెట్ సేల్స్ ఓ రేంజ్లో సేల్ అయ్యాయి. అప్పట్లో అదో రికార్డ్.అయితే మొదటి రోజు సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. మొదటి వారం పవన్ కళ్యాణ్ మాస్ ఫాలోయింగ్ వల్ల మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
కానీ తర్వాత సంక్రాంతి సినిమాల ఎంట్రీతో ‘బాలు’ డౌన్ అయిపోయింది. ‘బాలు’ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ యాక్షన్ సీన్స్ లో కనపరిచిన గ్రేస్ కానీ ఓ రేంజ్లో ఉంటాయి. ముఖ్యంగా ‘హట్ హట్ జా’ సాంగ్లో పవన్ కళ్యాణ్ శ్వాగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అశ్వినీదత్ మంచి నీళ్లలా డబ్బు ఖర్చుపెట్టారు.తెరపై వచ్చే ప్రతి విజువల్లో ఆయన పెట్టిన ప్రతి రూపాయి కనిపిస్తుంది. అయితే లోపం ఎక్కడ జరిగింది.
సినిమా అనుకున్న స్థాయిలో ఎందుకు విజయం సాధించలేదు అనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీనే. అయితే ‘బాలు’ సినిమా కథని కోన వెంకట్ డెవలప్ చేశారు. మొదట దీనికి దర్శకుడిగా వేరే దర్శకుడిని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్.. కరుణా కరణ్ పేరుని రిఫర్ చేయడంతో అశ్వినీదత్ ఓకే చెప్పారు. సడన్ గా ఈ ప్రాజెక్టులోకి రావడం వల్లో ఏమో కానీ కరుణాకరన్ ఈ కథని ఓన్ చేసుకోలేకపోయారు అనే చెప్పాలి. నేటితో ‘బాలు’ రిలీజ్ అయ్యి 21 ఏళ్ళు పూర్తికావస్తోంది.