మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana ShankaraVaraprasad Garu) సినిమాకి కావాల్సినంత బజ్ వచ్చేసింది. పాటలు, టీజర్ తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ అన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషించడం అనేది మరో ఆకర్షించే విషయం. సీనియర్ స్టార్ హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సందర్భం ఇప్పటివరకు ఒక్కటి కూడా లేదు. అలాంటిది చిరంజీవి సినిమాలో వెంకటేష్ కేమియో చేయడం అంటే మామూలు విషయం కాదు.
వెంకటేష్ కేమియోతో ‘మన శంకర వరప్రసాద్ గారు’కి మల్టీస్టారర్ అప్పీల్ వచ్చింది. అంతేకాదు చిరు, వెంకీ..ల పై ఓ పాట కూడా షూట్ చేశారు. ఇటీవల దాన్ని మెగా విక్టరీ మాస్ సాంగ్ గా రిలీజ్ చేశారు. ఆ పాటలో చిరు, వెంకీ కలిసి వేసిన చిందులు భలే సరదాగా అనిపించాయి. థియేటర్లలో ఈ పాటని ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునే అవకాశం పుష్కలంగా ఉంది.కాకపోతే ఈ పాట సినిమాలో ఎండ్ కార్డ్స్ కే పరిమితం కాబోతుంది అనేది ఇన్సైడ్ టాక్.
అవును చిరు,వెంకీ..ల పై తీసిన పాట సినిమాకి శుభం కార్డు పడ్డాక వస్తుందట. కథలో భాగంగా కాదట. ఇదొక డిజప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. కేవలం ప్రమోషన్ కోసమే ఈ సాంగ్ ని చిత్రీకరించారని దీంతో మనం అర్ధం చేసుకోవచ్చు.ఇక జనవరి 12న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ రిలీజ్ కానుంది. జనవరి 11 సాయంత్రం నుండే ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేశారు మేకర్స్.