Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

మహేష్ బాబు హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి'(Varanasi) అనే భారీ పాన్ వరల్డ్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ ను రామోజీ ఫిలింసిటీలో గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ఒక్క ఈవెంట్ తో ‘వారణాసి’ టైటిల్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. అలాగే అదే ఈవెంట్లో రాజమౌళి చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయనపై కేసులు కూడా ఫైల్ అయ్యాయి.

Varanasi

మరోవైపు టైటిల్ కూడా మాది అంటూ మరో సినిమా యూనిట్ ఛాంబర్లో కంప్లైంట్ ఫైల్ చేసి రచ్చ రచ్చ చేసింది. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. కొంత పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు రాజమౌళి చెప్పడం జరిగింది.ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘వారణాసి’ చిత్రాన్ని 2027 సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నట్టు సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి వెల్లడించిన సంగతి తెలిసిందే.

రాజమౌళి కూడా అదే మాట చెప్పారు. అయితే రాజమౌళి చెప్పిన టైంకి సినిమాని రిలీజ్ చేసిన సందర్భాలు లేవు. ఆయన చివరి వరకు చెక్కుతూనే ఉంటారు. కానీ అయినప్పటికీ నామ మాత్రంగా 2027 సమ్మర్ అని చెప్పారు. ఇంకా ఏడాది పైనే టైం ఉంది కాబట్టి.. అటూ ఇటూలో అయినా ఆ టైంకి సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం.. 2027 శ్రీరామనవమి రోజున అంటే ఏప్రిల్ 9న ‘వారణాసి’ ని విడుదల చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారట.

ఒకవేళ అదే నిజమైతే అటు రాజమౌళి అభిమానులకు ఇటు మహేష్ బాబు అభిమానులకు అది శుభవార్తే అవుతుంది. ఎందుకంటే ఏప్రిల్ నెల అనేది ఇద్దరికీ బాగా కలిసొచ్చింది. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ అదే నెలలో రిలీజ్ అయ్యి ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహేష్ బాబు ‘పోకిరి’ కూడా అదే నెలలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టింది. విచిత్రం ఏంటంటే 2 సినిమాలు ఏప్రిల్ 28 డేట్ కే రిలీజ్ అవ్వడం. సో ‘వారణాసి’ కి అదొక పాజిటివ్ సెంటిమెంట్ గా చెప్పుకోవచ్చు.

కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus