ఈటీవీ విన్ & వేణు ఉడుగుల నిర్మాణంలో కొత్త దర్శకుడు సాయిలు కాంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ రాజు వెడ్స్ రాంబాయి. ఈ మూవీ గత శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయ్యి, హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలో దాదాపుగా అందరు కొత్తవాళ్లే. హీరో అఖిల్ రాజ్ & హీరోయిన్ తేజు , కీలకమైన పాత్రలో నటించిన చైతన్య జొన్నలగడ్డ ఇంకా మిగతా క్యారెక్టర్లలో కూడా కొత్తవాళ్లే నటించారు.
రాజు వెడ్స్ రాంబాయి రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ హిట్ టాక్ తో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకోవటంతో మూవీ యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. దీనికి హీరో విష్ణు, రైటర్ కోన వెంకట్, బివిఎస్ రవి తదితర సినిమా ప్రముఖులు హాజరు అయ్యారు. సినిమా గురించి మాట్లాడుతూ నిర్మాత వేణు సినీ ప్రముఖులకు కొంత మందికి రిలీజ్ కి ముందే సినిమా షో వేయగా, దానికి పిలవని వారు కూడా రావటం. వారు సినిమా మధ్యలోనే లేచి వెళ్ళిపోటం జరిగింది. ఆ తరువాత సినిమా మీద నెగెటివ్ గ మాట్లాడటం కూడా చేసారంట. వాడొక డైరెక్టర్, ఇది ఒక సినిమానా..? ఒక్క షో కూడా ఆడదు ఈ మూవీ అని ఎద్దేవా చేసారంట.
వ్యక్తులకు కాకపోయినా సినిమాకి ఒక సాంస్కృతిక గౌరవం ఉందని, కనీసం అది కూడా వారు ఇవ్వలేదని బాధపడ్డాడు వేణు ఉడుగుల. ఈ రోజు చిత్రం రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్లో ఆదరణ చూస్తుంటే ఆనందబాష్పలు వస్తున్నాయి అని ఎమోషన్ అయ్యాడు. సినిమాలో కంటెంట్ ఉంటే ఎవ్వరు ఆపలేరు అనేది ఇప్పటికే చాలా సార్లు రుజువైంది.