సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ స్టార్ హీరోయిన్ మృతి!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు పట్టిపీడిస్తున్నాయి. ఓ స్టార్ సెలబ్రిటీ మరణించారు అన్న విషాద వార్త ఛాయలు మరువక ముందే మరో విషాద వార్త వినిపిస్తూ.. సినీ ఇండస్ట్రీని అల్లకల్లోలంగా మార్చేస్తుంది . కాగా ఇప్పటికే సినీ ఇండస్ట్రీ ఎంతో మంది స్టార్ ప్రముఖులను పోగొట్టుకుంది . మరీ ముఖ్యంగా ఈ ఆరు నెలల్లో సినీ ఇండస్ట్రీ లో ఉండే బడా బడా స్టార్స్ చాలా మంది తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

ఈ క్రమంలోనే తాజాగా సినీ ఇండస్ట్రీని మరో విషాద వార్త కబలించింది. సినీ జనాలకు మరో చేదువార్త వినిపించింది. సినిమా ఇండస్ట్రీ అలనాటి మేటి నటి పద్మశ్రీ సులోచన లట్కర్ఆదివారం కన్నుమూశారు . 94 సంవత్సరాల వయసులో ఈ ప్రఖ్యాత నటి మరణించారు . పలు మరాఠా, హిందీ సినిమాలలో ప్రముఖ పాత్రలు పోషించి.. సినీ ఇండస్ట్రీలో ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఈ స్టార్ నటి ఇక లేరు అని తెలుస్కున్న బాలీవుడ్ జనాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఈమె మరణ వార్తతో బాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్రశోఖ సందర్భంలో మునిగిపోయింది . మరాఠీ – హిందీ సినిమాలలో తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఈమె పలుసేవ కార్యక్రమాలలో కూడా ముందుండేది .కాగ 94 సంవత్సరాల వయసులో సులోచన లట్కర్ వృద్ధాప్యం కారణంగా ముంబైలోని సుశ్రుషా ఆసుపత్రిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా తెలిపారు. నటి సులోచన లట్కర్ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, దిలీప్ కుమార్ వంటి ప్రముఖ నటులతో సినిమాలు చేసింది .

జూలై 30, 1928న నటి సులోచన లట్కర్ బెల్గాంలోని చికోడి తాలూకా ఖడక్లారత్ గ్రామంలో జన్మించారు. 1943లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె మరాఠీ, హిందీ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. కటీపతంగ్, దిల్ దేకో దేఖో , గోరా ఔర్ కాలా వంటి పలు సినిమాలలో ఆమె చేసిన పాత్రలు చిరస్మరణీయంగా మారాయి. ‘సంగత్యే ఐకా’, ‘మోల్కారిన్’, ‘మరాఠా తిటుకా మేల్వావా’, ‘సాది మానసం’, ‘ఏక్తి’ సులోచనా దీదీ కెరీర్‌లో మరపురాని చిత్రాల్లో నటించి తన నటనకు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సులోచన దీదీ మరాఠీ చిత్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన తర్వాత హిందీ చిత్రసీమలో తన నటనా ముద్ర వేశారు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus