రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు భార్య మృతి..!

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత మరియు నటుడు అయిన పరుచూరి వెంకటేశ్వరరావు గారి భార్య విజ‌య‌ల‌క్ష్మి ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఈరోజు పరిస్థితి మరింత విషమించ‌డంతో హైదరాబాద్‌లోని వారి సొంత ఇంట్లోనే మరణించారు. విజయలక్ష్మి గారి మరణవార్తతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. పరుచూరి బ్రదర్స్‌ గా.. ఇండస్ట్రీలో తిరుగులేని ఖ్యాతిని సొంతం చేసుకున్నారు.. పరుచూరి వెంకటేశ్వరరావు అలాగే పరుచూరి గోపాల కృష్ణ.

వీరిలో పరుచూరి వెంకటేశ్వర రావుగారే పెద్దాయన. మాటల రచయితగా,మంచి నటుడిగా కూడా క్రేజ్ సంపాదించుకున్నారు వెంకటేశ్వర రావు గారు. ఎన్టీఆర్,ఎ.ఎన్.ఆర్,‌ కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ వంటి స్టార్ హీరోల సినిమాలకు పనిచేశారు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్.ఇక పరుచూరి బ్రదర్స్ కు అత్యంత సన్నిహితుడైన మెగాస్టార్ చిరంజీవి గారు.. పరుచూరి వెంకటేశ్వరరావు గారి భార్య మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

Veteran writer Paruchuri Venkateswara Rao’s wife passes away1

విజయలక్ష్మి గారి మరణవార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు.. పరుచూరి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి పరామర్శించారు. ‘ఇక పరుచూరి వెంకటేశ్వరరావు తనకు ఎంతో ఆత్మీయుడని, ఆ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. విజయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని’ కూడా చిరంజీవి తెలిపారు.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus