Vettaiyan Collection: ‘వేట్టయన్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

  • October 12, 2024 / 04:19 PM IST

‘జైలర్’ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు రజినీకాంత్ (Rajinikanth) . తాజాగా ‘వేట్టయన్- ది హంటర్’ తో (Vettaiyan) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘జై భీమ్’ తో ఆకట్టుకున్న టి.జె.జ్ఞానవేల్ (T. J. Gnanavel) ఈ చిత్రానికి దర్శకుడు. అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)  , ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), రానా దగ్గుబాటి (Rana), రావు రమేష్ (Rao Ramesh) కూడా సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ (Anirudh Ravichander) సంగీతం దర్శకుడు. ‘మనసిలాయో’ సాంగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ లభించింది.

Vettaiyan Collection

కానీ తెలుగు టైటిల్ లేకపోవడం వల్లో ఏమో కానీ… సినిమా ఆశించిన స్థాయిలో మొదటి రోజు కలెక్ట్ చేయలేదు.రెండో రోజు కూడా అంతే..! ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ గమనిస్తే :

నైజాం 1.60 cr
సీడెడ్ 0.63 cr
ఉత్తరాంధ్ర 0.46 cr
ఈస్ట్ 0.23 cr
వెస్ట్ 0.24 cr
గుంటూరు 0.26 cr
కృష్ణా 0.34 cr
నెల్లూరు 0.13 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 3.89 cr

‘వేట్టయన్’ కి రూ.10.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.3.89 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కి మరో రూ.7.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి.. పికప్ అవుతుందేమో చూడాలి.

సెలవులను మిస్ చేసుకున్న సూర్య కంగువ.. ఇలాంటి ఛాన్స్ దొరకదుగా!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus