Vicky Kaushal, Katrina Kaif: కత్రినాతో జీవితం గురించి విక్కీ ఏమన్నారంటే..?

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తమ బంధానికి సంబంధించిన అందమైన ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది ఈ జంట. కొన్ని ఇంటిమెంట్ ఫొటోలను సైతం షేర్ చేస్తుంటారు విక్కీ, కత్రినా. కొత్తగా పెళ్లైన సెలబ్రిటీలకు తమ దాంపత్య జీవితం గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో విక్కీ కౌశల్ కి కూడా ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి.

వీటిపై స్పందించిన విక్కీ.. కత్రినాతో కాపురంలో ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పుకొచ్చారు. తన జీవితంలో ప్రతి అంశంపై కత్రినా ప్రభావం గొప్ప రీతిలో ఉంటుందని అన్నారు విక్కీ కౌశల్. కత్రినా లాంటి భార్య దొరకడం తన అదృష్టమని చెప్పుకొచ్చారు. ఆమె చాలా ఇంటెలిజెంట్ అని.. చాకచక్యం కలిగినదని తన భార్య గురించి చెప్పారు. ప్రతిరోజు కత్రినా నుంచి ఎంతో నేర్చుకుంటున్నట్లుగా విక్కీ తన భార్య గురించి గొప్పగా చెప్పారు.

మొత్తానికి ఈ బాలీవుడ్ కపుల్ తమ వివాహబంధంలో సంతోషంగా ఉందన్నమాట. గతంలో రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ లు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇక ఇటీవల అబుదాబిలో జరిగిన ఐఫా ఈవెంట్ లో విక్కీ ‘సర్ధార్ ఉద్ధం’ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus