విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా వచ్చిన ‘మహారాజ’ మంచి సక్సెస్ అందుకుంది. అయితే లేటెస్ట్ గా వచ్చిన ‘విడుదల 2’ (Vidudala Part 2) మొదటి రోజే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. 2023 లో వచ్చిన ‘విడుదల’ మొదటి భాగం క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ దక్కింది. బాక్సాఫీస్ వద్ద అది నిలబడకపోయినా… ఓటీటీలో మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. సెకండ్ పార్ట్ పై ఆసక్తి ఏర్పడేలా చేసింది. కానీ రెండో పార్ట్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల ఆడియన్స్ పెదవి విరిచారు.
Vidudala Part 2 Collections:
తమిళంలో బాగానే ఓపెనింగ్స్ వచ్చినా… తెలుగు రాష్ట్రాల్లో నిరాశపరిచింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :
‘విడుదల 2’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.0 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటివారం ఈ సినిమా రూ.0.67 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా మరో రూ.2.83 కోట్ల షేర్ ను రాబట్టాలి. టార్గెట్ చాలా పెద్దగా ఉండటం వల్ల ఇక బ్రేక్ ఈవెన్ కష్టమే అని చెప్పాలి.