ఈరోజు సినీ పెద్దలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. నాగార్జున (Nagarjuna) , దిల్ రాజు (Dil Raju) , ఎస్.రాధాకృష్ణ(S. Radha Krishna), త్రివిక్రమ్ (Trivikram), కొరటాల శివ (Koratala Siva) , బోయపాటి శ్రీను(Boyapati Srinu), అనిల్ రావిపూడి (Anil Ravipudi) , వెంకటేష్ (Venkatesh), బాబీ కొల్లి (K. S. Ravindra), వంశీ పైడిపల్లి (Vamshi Paidipally), పీపుల్ మీడియా అధినేత టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) వంటి వారు రేవంత్ రెడ్డి మీటింగ్లో పాల్గొన్నారు. ఇక నుండి సినిమాల్లో.. “యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవీ కూడా ఉండకూడదు.సినిమా రిలీజ్ టైములో ప్రతి స్టార్ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఒక వీడియో చేయాలి.
Revanth Reddy
సినిమా టైటిల్స్ కూడా డ్రగ్స్, గం*యి వంటి పాదాలకి చోటివ్వకూడదు. టికెట్ రేట్లు పెంపు, బెనిఫిట్ షోలు వంటివి ప్రస్తుతానికి అనుమతించబడవు” అంటూ రేవంత్ రెడ్డి తెలిపారట. మరోపక్క .. “హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ సినిమా హబ్‌గా మార్చడానికి ప్రయత్నిస్తాం. సామాజిక కార్యక్రమాల్లో ఇండస్ట్రీ పార్టిసిపేషన్ ఉండాలి. డ్రగ్స్, గం*యిపై పోరాటంలో సినిమా హీరోలు పాల్గొంటారు. కొన్ని ఘటనల వల్ల ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు గ్యాప్ ఉన్నట్లు ప్రచారం జరిగింది.
అందులో వాస్తవం లేదు. ఇండస్ట్రీకి ఏమేం కావాలనేది మేము సీఎంని కోరాము. ఐటీ, ఫార్మా తో సమానంగా సినిమా పరిశ్రమని భావిస్తున్నాం. పరిశ్రమ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి” అంటూ రేవంత్ రెడ్డి తెలిపినట్టు ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు తెలిపారు. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం మాధక ద్రవ్యాల నిర్మూలన కొరకు ఎంతలా తపిస్తుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక నుండి సెన్సార్ వారు కూడా ఈ విషయాలపై మరింత శ్రద్దగా వ్యవహరించే అవకాశం ఉంది.