Vignesh Shivan, Nayanatara: నయన్, విగ్నేష్ పెళ్ళికి వచ్చే అతిథులు వీళ్లే?

ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమలో విహరిస్తూ ప్రేమపక్షులుగా ఉన్నటువంటి వారు ఒక్కొక్కరుగా పెళ్లిపీటలు ఎక్కుతూ వైవాహిక జీవితంలో స్థిరపడుతున్నారు. ఈ క్రమంలోనే విగ్నేష్, నయనతార కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు. వీరి పెళ్లి గురించి ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా చివరికి ఆ పెళ్లి ఘడియలు రానే వచ్చాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట జూన్ 9వ తేదీ మహాబలిపురంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకోనున్నారు.

ఇకపోతే వీరు పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా డైరెక్టర్ విగ్నేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మై లవ్ నయన్ ను జూన్ 9వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలియజేశారు.జూన్ 9వ తేదీ ఉదయం పెళ్లి జరుగుతుందని, మధ్యాహ్నానికి పెళ్లికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటామని తెలిపారు.

ఇక పెళ్లి తర్వాత జూన్ 11వ తేదీ మీడియా ముందుకు వస్తామని ఈ సందర్భంగా విగ్నేష్ వెల్లడించారు. ఇకపోతే తమ పెళ్లి ముందుగా తిరుపతిలో అనుకున్న మాట వాస్తవమేనని అయితే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లాలంటే ఎన్నో ప్రయాణ సమస్యలు, ఇతర సమస్యలు వస్తాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చివరి నిమిషంలో పెళ్లి వేదికను మహాబలిపురంలోకి మార్చాల్సి వచ్చిందని ఈ సందర్భంగా విగ్నేష్ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే తమ పెళ్లికి హాజరయ్యే అతిథుల గురించి కూడా ఆయన వెల్లడించారు.తమ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు అలాగే అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ విధంగా వీరి పెళ్లి గురించి ఈయన క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ముందుగానే ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus