Vijay Devarakonda: ‘లైగర్‌’ తర్వాత విజయ్‌ ప్లాన్‌ ఏంటో.. శివ సంగతేంటో!

  • January 21, 2022 / 11:30 AM IST

ప్రేమకథను ఫీల్‌ మూడ్‌లో తీసుకెళ్లి చూపించడం శివ నిర్వాణకు బాగా అలవాటు. చేసిన మూడు సినిమాల్లో రెండు అలాంటివే. ఇలాంటి ఫీల్‌ ఉన్న ప్రేమకథను మాస్ మేనరిజంతో అలరించిడం విజయ్‌ దేవరకొండకు అలవాటు. అలాంటి సినిమానే విజయ్ దేరకొండ అందరి వాడు అయిపోయాడు. అలాంటి ఇద్దరు కలసి ఓ సినిమా చేస్తారని ఆ మధ్య అనౌన్స్‌మెంట్‌ కూడా అయ్యింది. ఆ తర్వాత ‘టక్‌ జగదీశ్‌’ వచ్చింది. సరైన ఫలితం అందుకోలేకపోయింది. దీంతో విజయ్‌ సినిమా ఉండదు అనే టాక్ వచ్చింది. తాజాగా శివ నిర్వాణ ఈ సినిమా గురించి పరోక్షంగా మాట్లాడారు.

విజయ్‌ సినిమా ఆగిపోవడంతో, శివ నిర్వాణ – వెంకటేశ్ కాంబినేషన్‌ వర్కౌట్‌ అయ్యింది అంటూ సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అవుతోంది. దీనిపై శివ స్పందించాడు. వెంకటేశ్‌తో సినిమా ఏమీ లేదు అంటూ రాసుకొచ్చాడు. దీంతో ముందుగా ఓకే అనుకున్న విజయ్‌ సినిమా ఉన్నట్లే కదా అని కొందరు అనుకుంటున్నారు. మరికొందరు అయితే వెంకటేశ్‌ సినిమా లేదు అన్నాడు కానీ, విజయ్‌ సినిమా ఉంది అని అనలేదు కదా అనే లాజిక్‌ తీస్తున్నారు. ఈ నేపథ్యంలో మరింత క్లారిటీ కావాల్సి ఉంది.

‘లైగర్‌’ తర్వాత విజయ్‌ దేవరకొండ లైనప్‌ మీద మొన్నటివరకు క్లారిటీ లేదు. అయితే సుకుమార్‌కు బర్త్‌డే విషెష్‌ చెబుతూ విజయ్‌ ‘2023లో అదరగొడదాం’ అని రాసుకొచ్చాడు. దీంతో ‘లైగర్‌’ తర్వాత విజయ్‌ సుకుమార్‌తో సినిమా చేస్తాడు అని అంటున్నారు. ఆ లెక్కన శివ నిర్వాణ సినిమా ఇప్పట్లో లేనట్లే అనుకోవాలి. లేదంటే రెండు సినిమాలు పార్లల్‌గా తీస్తరనైనా అనుకోవాలి. ఈ ‘అనుకోవాలి’ కాన్సెప్ట్‌ కంటే విజయ్‌ దేవరకొండే దీనిపై ఫుల్‌ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని అభిమానులు ఆశిస్తున్నారు.

నానితో చేసిన ‘టక్‌ జగదీశ్‌’ ఓటీటీలో విడుదలైన తొలినాళ్లలో మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకుంది. దీంతో విజయ్‌ తన సినిమాపై వెనకడుగు వేశాడని అన్నారు. అయితే దీనిపై విజయ్‌ ఎక్కడా అఫీషియల్‌గా చెప్పలేదు. విజయ్‌ – శివ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నట్లు అప్పుడు చెప్పారు. కాబట్టి ఆయన కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వొచ్చు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus