Vijay Antony: మొత్తానికి దిగొచ్చిన విజయ్ ఆంటోనీ.. వైరల్ అవుతున్న లెటర్

  • March 21, 2024 / 06:39 PM IST

విజయ్ ఆంటోని (Vijay Antony) అందరికీ సుపరిచితమే. సంగీత దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యాడు. ‘మహాత్మా’ ‘దరువు’ (Daruvu) వంటి సినిమాలకి సంగీతం అందించాడు. తర్వాత ‘బిచ్చగాడు’ తో హీరోగా మారాడు. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో వరుసగా అతను హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా ‘బిచ్చగాడు’ క్రేజ్ తోనే అతను నెట్టుకొస్తున్నాడు. గతేడాది ‘బిచ్చగాడు 2 ‘ సినిమా కూడా హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ ” “‘మద్యం సేవించే విషయంలో స్త్రీ పురుష భేదాలు చూపకూడదు. మద్యం సేవించడం అనేది అన్ని జాతుల్లో సర్వసాధారణమైన అంశం.గతంలో మద్యం ఉండేది. తర్వాత సారా అయ్యింది. ఇప్పుడు బడా కంపెనీలు ఉత్పత్తి పెట్టి విస్కీ అంటున్నారు. యేసుక్రీస్తు కూడా ద్రాక్షరసం సేవించారు” అంటూ కామెంట్స్ చేశాడు. ఇవి పెద్ద దుమారం రేపాయి.

విజయ్ ఆంటోనీ తన కామెంట్స్ ని వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పకుండా తన ఇంటి ముందే నిరసనకు దిగుతామని క్రైస్తవ సంఘాలు మండిపడ్డాయి. దీంతో వెంటనే విజయ్ ఆంటోని ఈ విషయం పై స్పందించి క్షమాపణలు తెలుపుతూ ఓ లెటర్ ను విడుదల చేశాడు. ఆ లెటర్ ద్వారా విజయ్ ఆంటోనీ స్పందిస్తూ.. ‘‘నా ప్రియమైన క్రైస్తవ సోదరులారా…! ద్రాక్షా రసం అనేది ఇప్పుడు కనిపెట్టింది కాదు.దాదాపు 2 వేల సంవత్సరాల క్రితం కనిపెట్టింది. అప్పటినుండే దాని వాడకం ఉంది.

దేవాలయాలు, చర్చీల్లో దీన్ని వినియోగించారు. నేను ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను వక్రీకరించి తప్పుగా ప్రచారం చేశారు. మీ మనస్సులను నొప్పించినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. మతాలకు అతీతంగా ప్రజల కోసం రక్తాన్ని చిందించి పరలోకానికి వెళ్లిన యేసును తప్పుగా చిత్రీకరిస్తానని కలలో కూడా ఊహించలేదు’’ అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చాడు. విజయ్ ఆంటోని దిగొచ్చి ఇలా క్షమాపణలు కోరడంతో వివాదం సద్దుమణిగినట్టే అని చెప్పాలి.

ఓం భీమ్ బుష్ సెన్సార్ రివ్యూ!

విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus