కోలీవుడ్, టాలీవుడ్, ఇతర ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ నటులలో విజయ్ ఆంటోని ఒకరు. విజయ్ ఆంటోని కూతురు మీరా 16 సంవత్సరాల వయస్సులో డిప్రెషన్ తో మృతి చెందడంతో విజయ్ ఆంటోని ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. చదువుల ఒత్తిడితోనే మీరా ఆత్మహత్య చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారణ కాగా త్వరలో మీరా ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంది. అయితే మీరా ఆత్మహత్య అనంతరం విజయ్ ఆంటోని కుటుంబానికి సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
విజయ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లైఫ్ లో ఎలాంటి సంక్షోభం ఎదురైనా ఆత్మహత్య పరిష్కారం కాదని అన్నారు. మా నాన్న కూడా ఆత్మహత్య చేసుకున్నాడని ఆ సమయంలో నా వయస్సు ఏడేళ్లు అని నా చెల్లి వయస్సు ఐదేళ్లు అని విజయ్ ఆంటోని అన్నారు. నాన్న మరణం నా వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిందని విజయ్ ఆంటోని అన్నారు. అది ఎంత అనేది నాకు మాత్రమే తెలుసని ఆయన అన్నారు.
మా నాన్న మరణం తర్వాత మమ్మల్ని పెంచడానికి అమ్మ చాలా కష్టపడిందని విజయ్ ఆంటోని పేర్కొన్నారు. ఈ కారణం వల్లే ఆత్మహత్యల గురించి వింటే బాధ కలుగుతుందని విజయ్ ఆంటోని కామెంట్లు చేయడం గమనార్హం. జీవితంలో ఎదురయ్యే సంక్షోభాల గురించి నాకు తెలుసని చాలా కష్టాలను చూశానని విజయ్ ఆంటోని పేర్కొన్నారు. ఆత్మహత్య గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదని విజయ్ ఆంటోని అన్నారు.
విజయ్ ఆంటోని (Vijay Antony) వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. పిల్లల గురించి ఎంతో ఆలోచించే విజయ్ కుటుంబంలో ఈ తరహా ఘటన జరగడం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది. విజయ్ ఆంటోని కూతురు ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!