యాక్సిడెంట్ పాలైన స్టార్ హీరో..!

ప్రముఖ సంగీత దర్శకుడు కమ్ హీరో అయిన విజయ్ ఆంటోని.. యాక్సిడెంట్ పాలయ్యాడు. మలేషియాలో తన నెక్స్ట్ సినిమా షూటింగ్లో భాగంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్ బోట్ లో ప్రయాణిస్తుండగా.. సడెన్ గా ఆ బోట్ కెమెరా ఉన్న మరో పడవలోకి దూసుకెళ్ళిందట. దీంతో విజయ్ ఆంటోని తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సిబ్బంది అంబులెన్స్ కు ఫోన్ చేసి.. అతన్ని హాస్పిటల్ లో అడ్మిట్ చేశారట. ప్రస్తుతం అతనికి చికిత్స జరిగింది. కౌలాలంపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విజయ్ చికిత్స పొందుతున్నాడు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

ఇక విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ‘నకిలీ’ ‘డాక్టర్ సలీం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.’బిచ్చగాడు’ చిత్రంతో ఇతను మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.ఆ సినిమా ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది. కానీ తర్వాత చేసిన సినిమాలతో ఆ క్రేజ్ ను కంటిన్యూ చేయలేకపోయాడు. అయితే నటుడిగా కంటే ముందు తెలుగులో ఇతను మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు.బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండదు.

కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా .. అతని 100వ చిత్రంగా తెరకెక్కిన ‘మహాత్మ’ కి ఇతనే సంగీత దర్శకుడు. అటు తర్వాత రవితేజ హీరోగా ‘సిరుతై’ శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దరువు’ చిత్రానికి కూడా ఇతను సంగీతం అందించాడు. ఈ రెండు సినిమాల్లోని పాటలు చాలా బాగుంటాయి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus