మన హీరోలందరూ ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా మాయ/మోజులో పడిపోయి ఏడాదికి కనీసం ఒక్క సినిమా కూడా చేయడం మానేశారు. ఇదివరకు ప్రతి ఏడాది మహేష్, ఎన్టీఆర్, చరణ్, బన్నీలు కనీసం ఒక్క సినిమాతో అయినా ప్రేక్షకుల్ని పలకరించేవారు. అలాంటి వాళ్ళందరూ రెండు మూడేళ్ళకు ఒకసారి పలకరించే స్థితికి వచ్చేశారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ హీరోలని వేడుకుంటున్నారు దయచేసి కనీసం ఏడాదికి ఒక్క సినిమా చేయమని.
అయితే.. సినిమా సక్సెస్ రేంజ్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న ఏకైక హీరో కమ్ ప్రొడ్యూసర్ కమ్ ఎడిటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం విజయ్ ఆంటోనీ మాత్రమే. 2023లో 4 సినిమాలు రిలీజ్ చేసిన విజయ్ ఆంటోనీ, 2024లో 3 సినిమాలు విడుదల చేశాడు. ఇక 2025లో ఆల్రెడీ “మార్గన్”తో బోణీ కొట్టిన విజయ్, సెప్టెంబర్ లో “భద్రకాళి” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు. ఆ తర్వాత మళ్లీ లాయర్ అనే మరో సినిమాతో డిసెంబర్ లో ప్రేక్షకులని పలకరించేందుకు సన్నద్ధమవుతున్నాడు.
హీరోగా కెరీర్ మొదలుపెట్టిన 13 ఏళ్లలోనే 25 సినిమాలు పూర్తి చేయడమే కాక, మరో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండడాన్ని చూస్తుంటే.. రానున్న 10 ఏళ్లలో 50 సినిమాల మార్క్ ను కంప్లీట్ చేసి.. తన జనరేషన్ హీరోల్లో అత్యధిక చిత్రాల్లో నటించిన వ్యక్తిగా నిలిచేలా ఉన్నాడు విజయ్ ఆంటోనీ.
ఈ వేగం చూస్తుంటే.. విజయ్ ఆంటోనీ తన బ్యానర్ ను కార్పొరేషన్ బదులు ఫిలిం ఫ్యాక్టరీ అని మార్చుకుంటే బెటర్. ఎందుకంటే.. ఫ్యాక్టరీలానే వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు విజయ్. అయితే.. అతడి కష్టానికి తగ్గ కమర్షియల్ ప్రతిఫలం అయితే ఇప్పటివరకు దక్కలేదు. ఆ లోటు రానున్న సినిమాలతో తీరుతుందేమో చూడాలి.
పరాశక్తి టైటిల్ కాంట్రవర్సీ పై స్పందించిన విజయ్ ఆంటోనీ & టీమ్ #VijayAntony #Bhadrakaali #ArunPrabu pic.twitter.com/cohscvVshE
— Filmy Focus (@FilmyFocus) July 23, 2025