Vijay: సునాయాసంగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన హీరో విజయ్.. అసలేమైందంటే?

రజనీకాంత్ జైలర్, విజయ్ లియో సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కాగా ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలను మించి విజయం సాధించడం గమనార్హం. లియో సినిమాకు ఒకింత నెగిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. అయితే తాజాగా లియో మూవీ 600 కోట్ల రూపాయల క్లబ్ లో చేరడంతో పాటు రజనికాంత్ జైలర్ మూవీ రికార్డ్ ను బ్రేక్ చేసింది.

హీరో విజయ్ లియో సినిమాతో జైలర్ రికార్డ్ ను సులువుగానే బ్రేక్ చేశారు. ఈ సినిమా సక్సెస్ తో కోలీవుడ్ ఇండస్ట్రీ మరో మెట్టు పైకి ఎదిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవర్సీస్ లో లియో మూవీ 190 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించడం గమనార్హం. విజయ్ లియో భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించడంతో హీరో విజయ్ రేంజ్ ఇదేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

లియో సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని లోకేశ్ కనగరాజ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. లియో1 సినిమాలో జరిగిన పొరపాట్లు లియో2 విషయంలో జరిగే ఛాన్స్ లేదని తెలుస్తోంది. సీక్వెల్ లో లియో రోల్ ను పాజిటివ్ గా చూపిస్తారా? లేక నెగిటివ్ గా చూపిస్తారా? అనే ప్రశ్నలకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది. లియో సక్సెస్ తో విజయ్ రెమ్యునరేషన్ మరింత పెరిగిందని సమాచారం అందుతోంది.

విజయ్ (Vijay) ప్రస్తుతం వెంకట్ ప్రభు డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్నారు. విజయ్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. సినిమా సినిమాకు తెలుగులో మార్కెట్ ను పెంచుకుంటున్న విజయ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న విజయ్ ఈ సినిమాలతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus