Vijay, Chiranjeevi: చిరంజీవి స్టెప్ ను హీరో విజయ్ కాపీ కొట్టారా.. అసలేమైందంటే?

  • October 9, 2023 / 11:32 AM IST

చిరంజీవి సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఇంద్ర సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. బి.గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సోనాలి బింద్రే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలోని దాయి దాయి దామ్మ సాంగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది.

దాయి దాయి దామ్మ సాంగ్ లో చిరంజీవి వేసిన వీణ స్టెప్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. లారెన్స్ ఈ సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా పని చేశారు. అయితే విజయ్ ఈ సాంగ్ ను కాపీ కొట్టారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ తిరుమలై అనే సినిమాలో నటించగా ఈ సినిమాలోని తంతకా ధీంతక అనే సాంగ్ లో విజయ్ వీణ స్టెప్ వెయడం గమనార్హం. అయితే ఈ సాంగ్ కు కూడా లారెన్స్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు.

చిరంజీవి (Chiranjeevi) చేసిన స్థాయిలో వీణ డ్యాన్స్ స్టెప్ ను విజయ్ వేయలేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి డ్యాన్స్ స్టెప్ ను విజయ్ ఎందుకు కాపీ చేశాడో అర్థం కావడం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విజయ్ ఈ మధ్య కాలంలో తరచూ విమర్శల పాలవుతుండటం గమనార్హం. విజయ్ త్వరలో లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

లియో సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అవుతుందని చెబుతుండగా లియో ట్రైలర్ కు నెగిటివ్ రెస్పాన్స్ రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. లోకేశ్ కనగరాజ్ లియో విషయంలో ఇంత పెద్ద పొరపాటు ఎలా చేశాడో అర్థం కావడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లియో రిలీజైన తర్వాత ఈ పరిస్థితి మారుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. లియో సినిమా రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus