ఎన్నో ఆశలతో, మరెన్నో అంచనాలతో ‘లైగర్’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ‘వాట్ లగాదేంగే’ అంటూ ఏడాది క్రితం ఈ రౌడీ హీరో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇక నాకు తిరుగులేదు అనేలా యాటిట్యూడ్ కూడా కనిపించింది అని అప్పుడు విమర్శకులు కూడా అన్నారు. అయితే ఆ సినిమా అనూహ్యంగా దారుణ పరాజయం పాలైంది. అశలు, అంచనాలు అతలాకుతలం అయిపోయాయి. అయితే ఇప్పుడు ఆ నష్టాన్ని భర్తీ చేసేలా నెక్స్ట్ వన్ ఇయర్‌లో మూడు సినిమాలతో రావాలని చూస్తున్నాడు. అవి కూడా ఒక్కోటి ఒక్కో రకమైన సినిమా కావడం విశేషం.
పూరీ జగన్నాథ్ – విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కాంబినేషన్ వినడానికే వావ్ అనిపించింది. ఎందుకంటే పూరి వన్ లైనర్‌లు, విజయ్ యాటిట్యూడ్ కలిస్తే సంచలనం అనుకున్నారు. అయితే ఆ సినిమా తేడా కొట్టడంతో ఇప్పుడు విజయ్ బ్యాక్ టు పెవిలియన్ అయిపోయాడు. ప్రారంభించిన పనులు మొదుటపెట్టిన ‘జేజీఎం’ పక్కకు పోయింది. అప్పటికే ఓకే అయిన ‘ఖుషి’ ముందుకొచ్చింది. సమంత హీరోయిన్‌గా నటించిన ఆ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకొస్తుంది. శివ నిర్వాణ తెరకెక్కించిన ప్రేమకథ ఇది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమా తర్వాత విజయ్ చేస్తున్న మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ప్రస్తుతానికి ఈ పేరు పరిశీలనలోనే ఉంది అనుకుకోండి. అయితే దాదాపు ఓకే అయిపోయింది అంటున్నరు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు. ‘గీత గోవిందం’ సినిమాతో విజయ్ – పరశురామ్‌ది హిట్ కాంబినేషన్. దీంతో ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తామని ఇప్పటికే నిర్మాత దిల్ రాజు ప్రకటించేశారు.
నిజానికి పరశురామ్ సినిమా కంటే ముందే అనౌన్స్ అయ్యి.. ప్రారంభమై సినిమా గౌతమ్ తిన్ననూరిది. రామ్‌చరణ్‌తో గౌతమ్ ఈ సినిమా తీస్తాను అనుకున్నారట. కానీ విజయ్ చేస్తున్నాడు. అయితే ఈ రెండు కథలూ ఒక్కటే అని చెప్పలేం. ఆ విషయం పక్కనపెడితే ఈ ఇనిమాను వచ్చే ఏడాది వేసవిలో తీసుకొస్తారని సమాచారం. అలా విజయ్ నుండి రానున్న ఏడాదిలో మూడు సినిమాలు వస్తాయి.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!