‘టాక్సీవాలా’ వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ చిత్రం ద్వారా భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ‘గీత గోవిందం’ తరువాత మరోసారి ఈ జంట తెర పై కనిపించనుంది. మొన్నటి వరకూ ఈ చిత్రాన్ని కాకినాడ,ఖమ్మం పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ జరిపారు. సోషల్ మెసేజ్ తో కూడిన యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందట.
ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయ్యిందట. దీంతో విజయ్… క్రాంతి మాధవ్ డైరెక్షన్లో చేయబోయే తన నెక్స్ట్ సినిమాని మొదలుపెట్టేశాడు. అయితే .. ‘డియర్ కామ్రేడ్’ సినిమా ఫస్ట్ కాపీను చూసిన విజయ్ అసంతృప్తి వ్యక్తం చేశాడని తెలుస్తుంది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలని నిర్మాతల్ని కోరాడట. దీంతో రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించొద్దని సూచించాడంట. ఫైనల్ కాపీ సిద్ధమైన తరువాతే రిలీజ్ డేట్ ప్రకటించాలని చెప్పినట్లు స్పష్టమవుతుంది. దీనికి దర్శక నిర్మాతలు కూడా ఓకే చెప్పారట. మొదట ఈ చిత్రాన్ని ‘మే’ నెలలో విడుదల చేయాలనీ అనుకున్నారు.. అయితే ఇప్పుడు వాయిదా పడబోతుందని స్పష్టమవుతుంది.