Vijay Devarakonda: విజయ్ ధరించిన డ్రెస్ ఖరీదు అన్ని లక్షలా!

విజయ్ దేవరకొండ ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాప్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఈయన తాజా నటించిన ఖుషి సినిమా హిట్ అవ్వడం ఈయన సినీ కెరియర్ కు ఎంతో కీలకమని తెలుస్తుంది. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా మ్యూజిక్ కన్సర్ట్ కార్యక్రమాన్ని హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ కాస్త స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే ఈ వేడుకలో ఈయన వేసుకున్నటువంటి వైట్ అండ్ వైట్ పలోజ డిజైనర్ డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది.ఇక ఈ వేడుకలో విజయ్ ధరించిన ఈ డ్రెస్ తోనే లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇలా విజయ్ దేవరకొండ ధరించిన ఈ డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది దీంతో ఈయన ధరించిన ఈ డ్రెస్ ఖరీదు ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

అయితే విజయ్ (Vijay Devarakonda) వేసుకున్నటువంటి ఈ డ్రెస్ ఖరీదు సుమారు రెండు లక్షల రూపాయల విలువ చేస్తుందని తెలుస్తోంది. ఇలా ఈయన ధరించిన డ్రెస్ ఖరీదు రెండు లక్షలు అని తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండకు ఈ మధ్యకాలంలో నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి ఈయనకు హిట్ సినిమా పడి చాలా కాలం అవుతుంది. అయితే విజయ్ దేవరకొండ ఆశలన్నీ కూడా ఖుషి సినిమా పైనే ఉన్నాయి.

ఇక చివరిగా ఈయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైనటువంటి ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఆశలన్నీ కూడా ఖుషి పైనే పెట్టుకున్నారు. మరి ఈ సినిమా వీరికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus