Vijay Devarakonda, Prabhas: నాగీ తన స్నేహితుణ్ని మళ్లీ తీసుకొస్తున్నారా? ఇంకెంతమంది ఉన్నారో?

‘కల్కి 2898 ఏడీ’… ఆలోచన ప్రారంభం అవ్వడమే భారీ సినిమాగా మొదలైంది. ఆ తర్వాత సెట్స్‌ మీదకు వెళ్లే ముందే ప్రభాస్‌, దీపిక పడుకొణె, అమితాబ్‌ బచ్చన్‌ అంటూ స్టార్‌ కాస్ట్‌ను తీసుకొని పట్టాలెక్కింది. ఆ తర్వాత కూడా ఈ సినిమాలో స్టార్ల రాక కంటిన్యూ అవుతూ వస్తోంది. అలా అలా సినిమా ఎవరూ ఊహించనంత పెద్దదిగా మారుతోంది అంటున్నారు. దీనికి తాజాగా వచ్చిన మరో పుకారే ఉదాహరణ. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ ఉంటాడట.

‘సలార్‌’ సినిమా ఇచ్చిన విజయంతో జోరు మీదున్నాడు ప్రభాస్‌. వరుస పరాజయాల తర్వాత వచ్చిన భారీ విజయం అది. ఈ క్రమంలో సెట్స్‌ మీద రెండు సినిమాలు ఉండగా… ‘కల్కి 2898 ఏడీ’ సినిమా పనుల్ని వేగంగా పూర్తి చేసేందుకు రంగంలోకి దిగాడు. వివిధ కారణాల వల్ల ప్రభాస్‌ ఇటీవల షూటింగ్‌లకు, సినిమా ప్రచారాలకు రాలేదు. ఇప్పుడు స్పీడప్‌ పెంచాడు. అయితే కొత్తగా షూటింగ్‌ అనేసరికి కొత్త పుకారు వచ్చింది.

ఇందులో ఓ కీలక పాత్ర కోసం (Vijay Devarakonda) విజయ్‌ దేవరకొండను ఎంచుకున్నారట దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. సినిమా స్ట్రగ్లింగ్‌ డేస్‌లో విజయ్‌, నాగీ మంచి స్నేహితులు. సినిమాల్లో ఇద్దరూ పేరు సంపాదించుకోవడం మొదలుపెట్టిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఈ కాంబోలో వచ్చిందే. ఇప్పుడు నాగీ చేస్తున్న అతి పెద్ద ప్రయత్నంలో విజయ్‌ కూడా భాగమవుతున్నాడట. అయితే ఆ పాత్ర ఏంటి అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు దుల్కర్‌ సల్మాన్‌ కూడా ఇందులో ఉన్నాడు అన్నారు. అలాగే రానా కూడా ఈ సినిమాలో భాగమయ్యాడు.

ఇక కమల్‌ హాసన్‌ను ఏకంగా విలన్‌ను చేశారు ఈ సినిమ కోసం. ఇదంతా చూస్తుంటే ఈ సినిమా అంతకుమించిన మించి అని చెప్పొచ్చు. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ఇటీవల వైజయంతి మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus