Vijay Devarakonda: ఆ డైలాగ్ ఉన్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే..!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన సమంత జంటగా నటించిన సినిమా ఖుషి. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించారు. సినిమా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా లెవల్లో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు సినిమాను పూర్తిగా యూత్ ను టార్గెట్ చేసి రూపొందించినట్లు తెలుస్తోంది. లైగర్ సినిమాతో కెరీర్లోనే భారీ ఫ్లాపును మూట గట్టుకున్న విజయ్ దేవరకొండకు, చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో సక్సెస్ కోసం అర్రలు చాచిన సమంతకు ఈ సినిమా హిట్ ఓ బూస్ట్ మాదిరిగా పని చేస్తుందనడంలో సందేహం లేదు.

విజయ్ దేవరకొండ- సమంతలకే కాకుండా డైరెక్టర్ శివ నిర్వాణకు ఈ సినిమా మంచి కిక్కు నిచ్చింది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్లతో బిజీగా ఉంది. హీరోయిన్ సమంత అమెరికాలో ఖుషీ సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో కూడా తనదైన స్టైల్‎లో అందరినీ ఆకట్టుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా విజయ్ ఖుషిలోని తన డైలాగ్‎ను ఉద్దేశిస్తూ ఓ ఆసక్తికర పోస్టు చేశాడు. ఆ పోస్ట్‎కు తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ రిప్లై ఇచ్చాడు.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటులు కొన్ని సెంటిమెంట్స్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఆ హీరోయిన్ తో చేస్తే సినిమా హిట్ అవుతుంది. ఆ డైరెక్టర్ తో చేస్తే బాగుంటుంది అని .. మరి కొందరైతే ఆ ముహూర్తం రోజే సినిమాను స్టార్ట్ చేయాలని.. పలానా రోజే ఈ సినిమా రిలీజ్ చేయాలని సెంటిమెంట్స్ కు ప్రాధాన్యం ఇస్తుంటారు. అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ క్రేజీ సెంటిమెంట్ వైరల్ అవుతోంది. అదే విజయ్ దేవరకొండ మార్క్ డైలాగ్.. విజయ్ ఏ ముహూర్తాన అర్జున్ రెడ్డి సినిమాలో ‘ఆ పిల్ల నాది’ అంటూ డైలాగ్ చెప్పాడో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

అదే విధంగా బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ కూడా ఆ పిల్ల నాదిరా అనే డైలాగ్ వాడాడు. అందరికీ తెలిసిందే ఆ సినిమా ఎంతటి సక్సెస్ అయ్యిందో. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో కూడా ఈ డైలాగ్ ను వాడారు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది… అంటూ నెట్టింట్లో ఈ వార్త హల్ చల్ చేస్తోంది. అంతేకాదు దేవరకొండ బ్రదర్స్ కి ఈ డైలాగ్ బాగా అచ్చి వచ్చిందని ఆ పిల్ల నాది అనే డైలాగ్ ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది అంటూ విజయ్ (Vijay Devarakonda) ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus