Vijay Devarakonda: హైవే మీద ఇడ్లీ బండి పెట్టుకుందాం అనుకున్నాం: విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ – శివ నిర్వాణ – సమంత సినిమా ‘ఖుషి’ మాంచి జోరు మీద సాగుతూ, బజ్‌ కొనసాగుతున్న వేళ ఆగిపోయింది. ఏమైంది, ఎందుకు ఆగింది అనే విషయం మీకు తెలిసిందే. అయితే ఇప్పుడు విజయ్‌ దేవరకొండ ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ఆసక్తికర విషయం ఒకటి చెప్పుకొచ్చాడు. సినిమా ఆగిపోయినప్పుడు తమ ఫీలింగ్‌ ఏంటి, ఏం చేద్దాం అనుకున్నారు అనే విషయాలను కాస్త వినోదాత్మకంగా వివరించారు. దీంతో ఆ మాటలు ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి.

‘లైగర్‌’ సినిమా దారుణ పరాజయం తర్వాత (Vijay Devarakonda) విజయ్‌ దేవరకొండ సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇద్దాం అనుకున్నాడు. అనుకున్నట్లుగానే కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత జోరు పెంచే ప్రయత్నం చేశాడు. ఈ లోపు అప్పటికే ప్రారంభమైన ‘ఖుషి’ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాలేదు. కారణం సమంత అనారోగ్యం. మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత సినిమాకు గ్యాప్‌ ఇచ్చింది. ట్రీట్మెంట్‌ నేపథ్యంలో ఎప్పుడు మళ్లీ సెట్స్‌లోకి వస్తుందో చెప్పలేకుండా అయిపోయింది.

ఆ తర్వాత ఆమె ముఖానికి రంగేసుకోవడం మొదలుపెట్టింది. అయితే తొలుత ‘ఖుషి’ సినిమాకు కాకుండా హిందీ వెబ్‌ సిరీస్‌ ‘సిటడెల్‌’కు డేట్స్‌ ఇచ్చింది. దీంతో ఇక సమంత ‘ఖుషి’ చేయదు, హీరోయిన్‌ను మార్చేస్తారు అనే మాటలు కూడా వినిపించాయి. అయితే ఆమె వచ్చింది. సినిమా షూటింగ్‌ ప్రారంభించింది, అంతే వేగంగా పూర్తి చేసి ఇప్పుడు సెప్టెంబరు 1న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా ఆగిపోయిన టైమ్‌లో విజయ్‌ దేవరకొండ, శివ నిర్వాణ మధ్య ఆసక్తికర చర్చ జరిగిందట.

షూటింగ్‌కు సమంత రాలేకపోయిన సమయానికి సినిమా ఫస్టాఫ్‌ మాత్రమే అయ్యిందట. దీంతో ఆమె వచ్చే వరకూ వెయిట్‌ చేయాలనుకున్నారట. సినిమాకు ఆమె లేకుండా ఏం చెయ్యలేకపోవడమే కారణం. ఎందుకంటే ఆరాద్య పాత్ర కోసం సమంత ఎంతో కష్టపడిందట. అయితే సమంత వచ్చే వరకూ విజయవాడ హైవేపై సమంత పేరుతో ఇడ్లీ బండి పెట్టుకుందాం అంటూ విజయ్‌ దేవరకొండ, శివ జోక్స్‌ వేసుకునేవాళ్లట. ఇదన్నమాట సమంత ఇడ్లీ బండి కథ.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus