“అర్జున్ రెడ్డి”కి విజయ్ దేవరకొండ అందుకున్న పారితోషికంపై చర్చ!

అర్జున్ రెడ్డి మూవీ వచ్చి పదకొండు నెలలు అవుతోంది. ఇందులో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఈ గ్యాప్ లో మూడు సినిమాలను కంప్లీట్ చేశారు. ట్యాక్సీవాలా, గీత గోవిందం, నోటా.. రిలీజ్ కి ముస్తాబవుతున్నాయి. అయితే అర్జున్ రెడ్డి ఇప్పుడు మళ్లీ టాక్ ఆఫ్ టాలీవుడ్ అయింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 4 కోట్లతో తెరకెక్కి 50 కోట్ల కలక్షన్స్ రాబట్టింది. చిత్ర బృందం ఈ విజయాన్ని ఊహించలేదు. ఇంతటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించిన హీరోకి రెమ్యునరేషన్ ఓ రేంజ్ లో ఉంటుందనుకోవడంలో ఆశ్చర్యపడనవసరం లేదు. అది కాకుండా పెళ్లి చూపులు సినిమాతో విజయ్ దేవరకొండ హీరోగా నిరూపించుకున్నారు.

కనీసం పది లక్షలు అయినా తీసుకొని ఉంటారని భావించారు. అయితే అంత తీసుకోలేదంట. కేవలం ఐదు లక్షలు మాత్రమే అందుకున్నట్టు విజయ్ దేవరకొండ చెప్పారు. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టారు. దీంతో రెమ్యునరేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు సందీప్ వంగ ఆర్థిక పరిస్థితి చూసే అంత తక్కువ తీసుకున్నానని చెప్పి అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు. సినిమా విజయం సాధించిన తర్వాత సందీప్ వంగ అడగక ముందే లాభాల్లో వాటా ఇచ్చారని విజయ్ దేవరకొండ వెల్లడించడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus