పవన్ చిత్రంలో విజయ్ దేవరకొండ..!!

ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో యువనటుడు విజయ్ దేవరకొండకు గిరాకీ ఏర్పడింది. పెళ్లి చూపులు చిత్రంలో అతని నటనకు సినీ పెద్దలు అభినందిస్తున్నారు. గతంలో నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాల్లో నటించిన ఈ తెలంగాణ కుర్రోడికి  పెళ్లి చూపులు మంచి అవకాశాలను తెచ్చి పెట్టింది.   ప్రముఖ నిర్మాతలు అశ్విని దత్, దిల్ రాజు ప్రొడక్షన్ లో నటించే ఛాన్స్ కొట్టేసాడు. ప్రస్తుతం కొత్త దర్శకుడు  సందీప్ వంగా తో విజయ్ ఒక సినిమాకు సైన్ చేసాడు.

సూపర్ గుడ్ బ్యానర్‌పై ‘ద్వారకా’ అనే చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఫిలిం నగర్  తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలోను కీలక రోల్ విజయ్ కి వరించినట్లు తెలిసింది. కొన్ని రోజుల క్రితం పవన్ స్వయంగా విజయ్ తో మాట్లాడాడని, డాలీ డైరెక్షన్లో తాను చేయనున్న సినిమాలో నటించమని అడగగా… పెళ్లిచూపులు హీరో ఆనందంగా ఒప్పుకున్నట్లు సమాచారం. ఆగస్టు 15 తర్వాత సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నారు. పవర్ స్టార్ తో కలిసి నటించే అవకాశం దక్కించుకున్న విజయ్, భవిష్యత్తులో స్టార్ హీరో అవుతాడని సినీ వర్గాల వారు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus