విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తుంది.ఇటీవల ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ను విడుదల చేయగా.. దానికి మంచి స్పందన లభించింది. ఇక విడుదల చేసిన పాటకు కూడా మంచి స్పందన లభించింది. ఇక ఈ చిత్రాన్ని మే 31 న విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ రిషూట్ల విషయంలో డైరెక్టర్ ను తెగ ఇబ్బంది పెడుతున్నాడట. వివరాల్లోకి వెళితే ఈ చిత్ర షూటింగ్ సాగ భాగాన్ని ఈస్ట్ గోదావరి జిల్లాకి చెందిన కాకినాడలో చిత్రీకరించారు. అయితే వీటికి సంబందించిన రష్ చూసిన తరువాత విజయ్ దేవరకొండ నచ్చలేదని చెప్పాడట. దయచేసి రీషూట్ చేయమని దర్శకనిర్మాతలని కోరాడని సమాచారం.
అయితే మొదట నిర్మాతలు ఒప్పుకున్నా… డైరెక్టర్ మాత్రం ఒప్పుకోలేదట. దీంతో విజయ్ కోపానికి గురయ్యి తన తరువాతి చిత్రాన్ని మొదలు పెట్టి బిజీగా మారిపోయిన తరుణంలో ‘డియర్ కామ్రేడ్’ నిర్మాతలు విజయ్ ను బ్రతిమాలి తీసుకొచ్చారట. అయితే రీ షూట్ చేసినప్పటికీ విజయ్ సంతృప్తి చెందలేదట. దీంతో మొదట ఎడిటింగ్ వర్క్ మొదలు పెట్టి.. తరువాత కొంచెం ప్యాచ్ వర్క్ చేద్దామని విజయ్ మళ్ళీ దర్శకనిర్మాతలకి చెప్పాడట. ఇలా రిషూట్లు చేస్తూనే ఉంటే ఇక సినిమా ఎప్పుడు పూర్తవుతుందో అనే అనుమానాలు కూడా ఫిలింనగర్లో వ్యక్తమవుతున్నాయి.