హీరోయిన్లు తెల్లగా.. గ్లామర్ ఉన్నవాళ్లే ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు అనేది వట్టి అపోహ మాత్రమే..! బాలీవుడ్ నటి.. కాజోల్ ను ఈ విషయంలో బెస్ట్ ఎగ్జామ్పుల్ గా చెప్పుకోవచ్చు. ఇక సౌత్ లో అయితే చాలా మంది హీరోయిన్లే ఉన్నారు. ఇటీవల ఐశ్వర్య రాజేష్ ను ఈ లిస్ట్ లో వేసుకోవచ్చు. ఈ అమ్మడు గ్లామర్ పరంగా కాదు నటన పరంగానే మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈమెకు తల్లి పాత్రలే ఎక్కువ వస్తుండడంతో.. బాగా హర్ట్ అయినట్టు తెలుస్తుంది. తమిళంలో ఈమె చేసిన ‘కాకా ముట్టై’లో చిన్న పిల్లాడికి తల్లిగా నటించింది.
అప్పటి నుండీ ఈమెకు అలాంటి పాత్రలే ఎక్కువ వస్తున్నాయి. ఇటీవల వచ్చిన విజయ్ దేవరకొండ… ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో కూడా ఓ చిన్న పిల్లాడికి తల్లిగా నటించింది. ఈ చిత్రంలో ఈమె పాత్రకి చాలా మంచి పేరొచ్చింది. సువర్ణ అనే పాత్రలో ఈమె పరకాయ ప్రవేశం చేసింది.. హీరో విజయ్ దేవరకొండ కంటే కూడా బాగా నటించింది… అనే ప్రశంసలు అందుకుంది. అయితే వరుసగా ఇలాంటి పాత్రలే ఎక్కువ వస్తుండడంతో.. ఇక పై వాటిని చెయ్యను అని ఈమె మీడియా ముఖంగానే తేల్చి చెప్పేసింది. తన పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలనే ఈమె చేస్తుందట కానీ ఇలా తల్లి పాత్రలు మాత్రం చెయ్యదట.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
Most Recommended Video
యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!