Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

ఒక మనిషిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టొచ్చు.. అంత ఇబ్బంది పెట్టినా ఎంత ఓర్పుగా ఉండాలి.. ఈ విషయాల గురించి తెలియాలంటే తమిళ స్టార్‌ హీరో విజయ్‌ని చూస్తే సరి. ఎందుకంటే ఆయన సినిమాలకు గ్యాప్‌ ఇచ్చి/ వదిలేసి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పటి నుండి పడుతున్న కష్టాలు, ఆయన్ని పెడుతున్న ఇబ్బందులు అలా ఉన్నాయి మరి. ఆయన, ఆయన పార్టీ పడుతున్న కష్టాలకు తోడు ఇప్పుడు విజయ్‌ రాబోయే సినిమా పైరసీ తోడైంది. అవును ‘జన నాయగన్‌’ సినిమా లీక్‌ అయింది.

Jana Nayagan Movie

గురువారం సాయంత్రం నుండి తమిళనాట ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమాలోని కొన్ని సీన్స్‌ సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. అవేవో లీక్‌ అయిన నాణ్యత లేని వీడియోలు కాదు. మంచి క్వాలిటీ వీడియోలే లీక్‌ అయ్యాయి. తొలుత లీక్స్ అంటూ తమిళ వెర్షన్ సినిమా క్లిప్స్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత ఫుల్ మూవీ బయటికు వచ్చిందంటూ స్క్రీన్ షాట్లు కనిపించాయి. ఒక పైరసీ వెబ్‌సైట్‌ అయితే ‘మేం నైతికతకు విలువిస్తూ ఆ ప్రింట్ షేర్ చేయడం లేదు’ అని రాసుకొచ్చింది.

అంటే ఈ సినిమా లీక్‌ అయింది నిజమే అని తేలిపోయింది. దీంతో సినిమా నిర్మాణ సంస్థ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. పైరసీ లింక్‌లు, వీడియోలను డిలీట్‌ చేయిస్తోంది. అయితే ఆ వీడియో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో పూర్తిగా తీసేయడం కష్టం అని అంటున్నారు. దీంతో ఇప్పటికిప్పుడు సినిమాను రిలీజ్‌ చేసేయడం ఒకటే బెటర్‌ అనే వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 24 వరకు సినిమా రిలీజ్‌ చేసే పరిస్థితి లేదు.

కొందరు అయితే విజయ్‌ను అణచివేయడానికి ఈ లీకులు చేశారు అని అంటున్నారు. మరికొందరైతే విజయ్‌కి అనుకూలంగా మారడానికి ఈ లీకులు బయటకు ఇచ్చారు అని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కరూర్‌ తొక్కిసలాట, విడాకుల విషయం, సినిమా సెన్సార్‌ సమస్య, ఇప్పుడు పైరసీ అన్నీ విజయ్‌ని ఇబ్బంది పెట్టేవే.

డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus