LEO First Review: విజయ్ లియో ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే?

విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో మూవీ ఈ నెల 19వ తేదిన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ మారనుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజం లేదని ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఒక సంస్థ క్లారిటీ ఇచ్చింది. భగవంత్ కేసరి, లియో, శివరాజ్ కుమార్ ఘోస్ట్ సినిమాలు ఒకే రోజు థియేటర్లలో విడుదల కానున్నాయి. టైగర్ నాగేశ్వరరావు సినిమా ఈ నెల 20వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

దసరా పండుగ కానుకగా నాలుగు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానుండగా ఏ సినిమా బెటర్ టాక్ ను సొంతం చేసుకుంటుందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. అయితే విజయ్ లియో మూవీ రిలీజ్ కు చాలా సమయం ఉన్నా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ ఈ సినిమా రివ్యూను ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

లియో (LEO) మూవీలో గౌతమ్ మీనన్ సైతం ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. గౌతమ్ మీనన్ మాట్లాడుతూ అక్టోబర్ 19వ తేదీన లియో మూవీ రిలీజ్ కానుందని ఈ సినిమా మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్ అని చెప్పుకొచ్చారు. డబ్బింగ్ సమయంలో ఈ సినిమాలోని నా సీన్లు చూశానని లియో మూవీ సూపర్ గా వచ్చిందని ఆయన అన్నారు. విజయ్ తో వర్క్ చేయడం అద్భుతమైన అనుభూతి అని గౌతమ్ మీనన్ కామెంట్లు చేశారు.

ఉదయం 9 గంటలకు మూవీ షూట్ ఉంటే 7 గంటలకు విజయ్ సెట్ కు వచ్చేవారని డైలాగ్ పేపర్లను తీసుకుని విజయ్ ప్రాక్టీస్ చేసేవారని ఆయన పేర్కొన్నారు. విజయ్ నిబద్ధత, వృత్తి విషయంలో అంకిత భావం ఉన్న నటుడని సినిమా షూటింగ్ సమయంలో మేము చాలా సరదాగా గడిపామని ఆయన తెలిపారు. మాస్టర్ తర్వాత విజయ్ లోకేశ్ కాంబో మూవీ కావడం, అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus