The GOAT: రికార్డ్ స్థాయిలో విజయ్ మూవీకి బిజినెస్.. లియో రైట్స్ ను క్రాస్ చేసిందిగా!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో విజయ్ కు (Vijay Thalapathy) ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి పాలిటిక్స్ తో బిజీ కానున్న నేపథ్యంలో విజయ్ చివరి సినిమాలు కచ్చితంగా హిట్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయ్ గత సినిమా లియో సెకండాఫ్ విషయంలో ప్రేక్షకులను ఒకింత నిరుత్సాహానికి గురి చేసిన సంగతి తెలిసిందే. అయితే లియో (LEO) భారీ హిట్ గా నిలవకపోయినా ది గోట్ సినిమా బిజినెస్ పరంగా అదరగొడుతోంది.

The GOAT

లియో సినిమా కేరళ రైట్స్ 16 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ది గోట్ (The GOAT) కేరళ రైట్స్ ఏకంగా 17 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో మూవీ కేరళ రైట్స్ ఇంత మొత్తానికి అమ్ముడవడం లేదని తెలుస్తోంది. రికార్డ్ స్థాయిలో విజయ్ మూవీకి బిజినెస్ జరుగుతుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ నంబర్ వన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

విజయ్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమాల్లో విజయ్ నటిస్తే బాగుంటుందని అభిమానులు సూచిస్తున్నారు. అయితే సినిమాలకు గుడ్ బై చెబితే మాత్రమే రాజకీయాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టే అవకాశం అయితే ఉంటుందని విజయ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. విజయ్ రెమ్యునరేషన్ 150 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

ది గోట్ మూవీ కమర్షియల్ గా సక్సెస్ సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తుందేమో చూడాలి. ది గోట్ మూవీ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం వస్తుందో చూడాల్సి ఉంది. విజయ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

దేవర స్పెషల్ వీడియో ఆ తేదీన రిలీజ్ కానుందా,. అసలేమైందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus