Devara: దేవర స్పెషల్ వీడియో ఆ తేదీన రిలీజ్ కానుందా,. అసలేమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) దేవర (Devara) సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) విలన్ గా నటిస్తుండగా భైరా అనే పాత్రలో ఆయన కనిపించనున్నారు. గతంలో సైఫ్ పాత్రను పరిచయం చేస్తూ ఒక పోస్టర్ విడుదల కాగా ఆ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 16వ తేదీన సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు కావడం గమనార్హం.

Devara

సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 15వ తేదీన ఈ సినిమా నుంచి సైఫ్ పాత్రకు సంబంధించిన స్పెషల్ వీడియో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ధృవీకరణ రావాల్సి ఉంది. ఈ సినిమాలో సైఫ్ నట విశ్వరూపం చూపించనున్నారని తెలుస్తోంది. దేవర తర్వాత తెలుగులో సైఫ్ అలీ ఖాన్ కు ఆఫర్లు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  , సైఫ్ అలీ ఖాన్ నటించడం వల్ల హిందీ ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిజినెస్ పరంగా అదరగొడుతున్న దేవర కలెక్షన్ల పరంగా కూడా అదరగొడుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. దేవర సినిమా విషయంలో జాన్వీ కపూర్ సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు దేవర స్పెషల్ మూవీగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

దేవర, సైఫ్ అలీ ఖాన్ పాత్రల మధ్య ఎమోషనల్ కనెక్షన్ ఉంటుందని తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ క్రేజ్ వల్ల హిందీలో సైతం ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని భోగట్టా. దేవర సినిమా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. దేవర2 సినిమా 2026 సంవత్సరంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. దేవర2 సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాల్సి ఉంది.

చిరంజీవి సినిమాకు స్క్రీన్ల కష్టాలు.. బర్త్‌ డే గిఫ్ట్‌ ఉంటుందా? లేదా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus