Vijay: విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?
- March 16, 2026 / 07:54 PM ISTByFilmy Focus Desk
‘టాక్సీవాలా’ తర్వాత విజయం అందుకుని ఎనిమిదేళ్లు అవుతున్నా.. విజయ్ దేవకొండ జోరు ఆగడం లేదు. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. ఇప్పుడు మూడో సినిమాకు కూడా రెడీ అయిపోయాడని సమాచారం. నానికి ఓ మరపురాని సినిమాను ఇచ్చిన యువ దర్శకుడు విజయ్‌కి ఇటీవల లైన్ చెప్పి ఓకే చేయించుకున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఉగాదికి ఆ సినిమా ప్రకటన కూడా ఉంటుంది అని సమాచారం.
Vijay – Shouryuv
విజయ్ దేవరకొండ ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ సినిమాలతో బిజీగా ఉన్నారు. పెళ్లి పనులు, సంబరాలు, సరదాలు అయిపోయాక ఇప్పుడు సినిమా సెట్‌లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో ఎక్కడ గ్యాప్ దొరికిందో ఏమో నాని ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ ఓ స్టోరీ లైన్ వినిపించేశారట. ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో పూర్తి కథ సిద్ధం చేసుకోమని విజయ్ చెప్పాడట. ఆ పని కూడా దాదాపు అయిపోవచ్చిందని చెబుతున్నారు. అందులో త్వరలో అనౌన్స్‌మెంట్ అని చెబుతున్నారు.

ఇక విజయ్ నుండి ఈ ఏడాదిలో ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ వచ్చేస్తున్నాయి. ఆ వెంటనే శౌర్యువ్ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. అయితే దీని కోసం కాస్త మేకోవర్ అవసరమని.. దానికి ఒకట్రెండు నెలల గ్యాప్ ఇస్తారని టాక్. ‘హాయ్ నాన్న’ సినిమా లాంటి ఎమోషనల్ కథతో కాకుండా ఈ సారి మైథలాజికల్ టచ్‌తో సాగే స్క్రిప్ట్‌ను శౌర్యువ్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా కూడా ‘హాయ్ నాన్న’ సినిమా నిర్మాణ సంస్థ వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌లోనే ఉంటుంది అని చెబుతున్నారు.
విజయ్ ఇప్పటివరకు మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా అయితే చేయలేదు. ఇతర హీరోలు ఇలాంటి సినిమాలు చేసి విజయాలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ కూడా ఇదే ట్రెండ్‌లోకి వచ్చేస్తున్నాడు అని చెప్పొచ్చు. చూద్దాం మరి ట్రెండ్ అయినా విజయ్‌కి హిట్ ఇస్తుందేమో.














