టాలీవుడ్ ఇండస్ట్రీలో నటినట్లుగా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో తమన్నా , విజయ్ వర్మ ఒకరు. వీరిద్దరూ కూడా ఇండస్ట్రీలో నటీనటులుగా కొనసాగుతున్నారు. ఇద్దరు లస్ట్ స్టోరీస్ 2 లో నటించారు. ఈ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇలా వీరి ప్రేమ విషయాన్ని బహిరంగంగా తెలియచేయడమే కాకుండా వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా జంటగా కలిసే వెళ్తున్నారు. ఈ విధంగా తమన్నా విజయ్ చట్టా పట్టాలేసుకొని తిరగడమే కాకుండా త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్త వైరల్ గా మారింది.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నటుడు విజయ్ వర్మకు తమన్నాతో పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. తమన్నాతో మీ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది. ఈ ప్రశ్నకు విజయ్ వర్మ సమాధానం చెబుతూ ఇప్పటికే నా మేనకోడలు మా అమ్మను ప్రశ్నలు అడుగుతోంది ..నేను పదే పదే హైదరాబాద్లో కూడా ఈ ప్రశ్న విన్నాను అని తనదైన శైలిలో ఛమత్కరించాడు. ఏది ఏమైనా ఈయన వీరి పెళ్లి గురించి చెప్పకుండా చాలా తెలివిగా ఆ ప్రశ్నలు దాటవేశారని తెలుస్తుంది.
ఇకపోతే ఈ ఏడాదిలోనే (Tamanna) తమన్నా విజయ్ వర్మ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. వచ్చే రెండు మూడు నెలలలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తమన్న సాంప్రదాయం ప్రకారం పెళ్ళికి ముందు కుటుంబ సభ్యులందరూ కూడా పలు దేవాలయాలను సందర్శించాల్సి ఉంటుందని ప్రస్తుతం ఈమె ఈ పనిలోనే ఉన్నారని తెలుస్తుంది. త్వరలోనే వీరి పెళ్లి తేదీ గురించి కూడా అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.