Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్
- June 5, 2026 / 07:57 PM ISTByPhani Kumar
దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు.రాజమౌళి గారు తీసే సినిమాలకి కథలు అందించేది ఆయన తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ అనే సంగతి అందరికీ తెలిసిందే. కేవలం రైటర్ గానే కాకుండా రాజమౌళి తీసే ప్రతి సినిమాకి హైప్ పెంచే బాధ్యత తీసుకుంటూ ఉంటారు విజయేంద్రప్రసాద్.
Varanasi
ఆయన పాల్గొనే ఇంటర్వ్యూల్లో రాజమౌళి అప్ కమింగ్ మూవీస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు. అవి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి.

ఇప్పుడు కూడా అదే జరిగింది.రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘వారణాసి'(Varanasi) అనే పాన్ వరల్డ్ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. విజయేంద్రప్రసాద్ ఇటీవల ఓ ఫ్యాన్ మీట్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఓ అభిమాని.. ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ ఈవెంట్లో విజయేంద్రప్రసాద్ పలికిన మాటలను గుర్తుచేశాడు.ఆ ఈవెంట్లో విజయేంద్రప్రసాద్…” ‘వారణాసి’ సినిమాలో ఉండే ఓ 30 నిమిషాల సీక్వెన్స్ ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తుంది” అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇదే అంశంపై ఆ అభిమాని ప్రశ్నించడం జరిగింది.
దానికి విజయేంద్రప్రసాద్ గారు బదులిస్తూ..”ఆ ఎపిసోడ్ మరేదో కాదు…. ‘రాముడికి, కుంభకర్ణుడికి మధ్య జరిగే ఒక మహా యుద్ధం’. టైటిల్ గ్లింప్స్ లో కుంభకర్ణుడు కనిపించాడు కదా కానీ రాముడు కూడా కనిపించాడు కదా. ఆంజనేయుడి తోక, దానిపై రథం వెళ్లడం మొత్తం చూశారుగా..! దానికి సంబంధించిన ఎపిసోడే అది” అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు. విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. మహేష్ బాబు అభిమానులు అయితే.. ఈ వీడియోని తెగ వైరల్ చేశారు.
జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్













