విజయ్ రికార్డు.. ఫ్యాన్స్ హడావిడి!

  • January 22, 2021 / 07:36 PM IST

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేశారు.ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆ ఎఫెక్ట్ కలెక్షన్లపై మాత్రం చూపలేదు. కోలీవుడ్ సమాచారం ప్రకారం.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. విడుదలైన తొమ్మిది రోజుల్లో ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. అయితే ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ ఖరారు చేయాల్సివుంది. విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఈ విజయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యాభై శాతం ఆక్యుపెన్సీలో కూడా తమ అభిమాన హీరో సినిమా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరిందంటూ ట్విట్టర్ లో పోస్ట్ లు పెడుతున్నారు. ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

తమిళనాడులో రూ.105 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి రూ.25.5 కోట్లు, కేరళలో రూ.10.5 కోట్లు, కర్ణాటకలో రూ. 15 కోట్లు, నార్త్ ఇండియాలో రూ.5.5 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 39.5 కోట్లు గ్రాస్ వసూలు చేసిందని సమాచారం. అయితే ఈ లెక్కలపై అధికార ప్రకటన రాలేదు. ఈ సినిమాలో విజయ్ కి విలన్ గా విజయ్ సేతుపతి నటించగా.. మాళవిక మోహనన్, ఆండ్రియా, శాంతను భాగ్యరాజ్, అర్జున్ దాస్ ముఖ్యపాత్రలు పోషించారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus